ఢీ షో నుండి సుధీర్ బయటకు రావడానికి కారణం అదేనా..!

ఈటీవీలో సూపర్ సక్సెస్ ఫుల్ షోస్ అంటే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ తో పాటుగా ఢీ షో అని కూడా చెప్పొచ్చు.ఈ మూడు షోలతోనే ఈటీవీ సత్తా చాటుతుంది.

 Sudheer Quit Dhee Dance Show Here Is The Reasons , Anchor Sudheer, Dhee Dance Show, Dhee Sudheer, Etv, Jabardasth Sudheer , Latest Movie News, Sudheer, Sudheer Comedy, Sudigali Sudheer-TeluguStop.com

కామెడీ షో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కొన్నేళ్లుగా ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తుంటే ఢీ డ్యాన్స్ షో కూడా 13 సీజన్లుగా ప్రేక్షకులను అలరిస్తుంది.ఢీ డ్యాన్స్ షోలో సుడిగాలి సుధీర్ మెంటర్ గా చేస్తూ వచ్చారు.

దాదాపు 3 సీజన్ల నుండి ప్రదీప్ యాంకర్, సుధీర్, రష్మి మెంటర్స్ గా చేస్తున్నారు.

 Sudheer Quit Dhee Dance Show Here Is The Reasons , Anchor Sudheer, Dhee Dance Show, Dhee Sudheer, Etv, Jabardasth Sudheer , Latest Movie News, Sudheer, Sudheer Comedy, Sudigali Sudheer -ఢీ షో నుండి సుధీర్ బయటకు రావడానికి కారణం అదేనా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే లేటెస్ట్ గా సుధీర్ ఢీ షో నుండి బయటకు వచ్చాడు.

ఢీ 14వ సీజన్ కు కేవలం హైపర్ ఆది మాత్రమే టీం లీడర్ గా చేస్తున్నాడు.అతనితో పాటుగా బిగ్ బాస్ సీజన్ 4 రన్నర్ అఖిల్ సార్ధక్ మెంటర్ గా ఉన్నాడు.

సుధీర్ లేకపోవడం వల్ల కామెడీ మిస్ అయ్యింది.సుధీర్ మళ్లీ ఢీ కి రావాలని అతని ఫ్యాన్స్ కోరుతున్నారు.

అయితే సుధీర్ ఢీ వదలడానికి కారణం అతను సినిమాల్లో బిజీ అవడమే అని తెలుస్తుంది.అంతేకాదు జబర్దస్త్, ఢీ రెండిటిలో ఒకటే చేయాల్సిన పరిస్థితి రాగా తనకు ఇంత క్రేజ్ తెచ్చిన జబర్దస్త్ ను మాత్రమే చేస్తూ ఢీని వదులుకున్నాడట సుధీర్.

అంతేకాదు సుధీర్ ఢీ నుండి బయటకు రావడానికి అతను అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వట్లేదని కూడా టాక్.ఏది ఏమైనా ఢీ లో సుధీర్ మిస్ అవడం వల్ల టి.ఆర్.పి రేటింగ్ పడిపోయిందని తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube