పులిహోర చేసిన సుధీర్.. సుమక్క ఏం అనిందంటే?

సుడిగాలి సుధీర్.ఈ వ్యక్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

 Pulihora Recipe, Sudigali Sudheer, Anchor Suma, Eat Talk With Sumakka, Rashmi, D-TeluguStop.com

ఎందుకంటే సుడిగాలి సుధీర్ అల్లరి మాములు విషయం కాదు కాబట్టి.ఇటు జబర్దస్త్ లో అటు ఢీ షో లో రెండింటిలో అద్భుతమైన స్కిట్లు వేస్తూ హాల్ చల్ చేసే సుడిగాలి సుధీర్ గురించి తెలియని వారు ఉండరు.

నిత్యం వార్తల్లో నిలిచే సుడిగాలి సుధీర్ కు రష్మీ కి పెళ్లి అని కూడా అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తుంటాయి.ఆ వార్తలు ఎంత నిజమో తెలియదు కానీ ఆన్ స్క్రీన్ పైన అయితే రొమాన్స్ రెచ్చిపోతుంటారు.

అందుకే ఆ వార్తలు నిజం అని జనాలు కూడా నమ్ముతుంటారు.

ఇక ఈ విషయం ప్రస్తుతానికి పక్కన పెడితే సుధీర్ ఓ పని చేశాడు.

ఏం చేసాడంటే పులిహోర కలిపాడు.సాధారణంగానే సుధీర్ కి పులిహోర కలపడం బాగా వచ్చు.

అలాంటి సుధీర్ ఇప్పుడు కొత్తగా పులిహోర కలపడం ఏంటి అని ఆశ్చర్యం వెయ్యచ్చు కానీ ఇది ఆ పులిహోర కాదు.వంట చేసాడు.

అది కూడా పులిహోరనే.ఎవరికోసం చేశాడో తెలుసా? సుమక్క కోసం పులిహోర చేశాడు.ఎందుకంటే ఆమె యూట్యూబ్ ఛానెల్ కు గెస్ట్ గా వచ్చాడు సుడిగాలి సుధీర్.

బుల్లితెర స్టార్ యాంకర్ సుమకు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ఉందన్న సంగతి తెలిసిందే.

అదే సుమక్క అనే యూట్యూబ్ ఛానెల్.ఇక ఈ యూట్యూబ్ ఛానెల్ లో దసరా స్పెషల్ గా ”ఈట్ టాక్ విత్ సుమక్క” అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ షో కు స్పెషల్ గెస్ట్ సుడిగాలి సుధీర్ వచ్చాడు.అంత స్పెషల్ గా వస్తే ఎవరైనా ఎపిసోడ్ చూడకుండా ఉంటారా? చూశారో లేదో అనే విషయాన్నీ పక్కన పెడితే.సుడిగాలి సుధీర్ పై సుమక్క వేసే ప్రతి పంచు పేలుతుంది.ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ నెంబర్ 1 గా కొనసాగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube