Sudheer Galodu Movie: భారీ ధరలకు సుధీర్ గాలోడు ఓటీటీ రైట్స్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ అదే పాపులారిటీతో వెండి తెరపై అవకాశాలను కూడా అందుకున్నారు.అయితే వెండితెరపై ఈయన పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినప్పటికీ ప్రస్తుతం హీరోగా అవకాశాలు అందుకుంటున్నారు.

 Sudheer Galodu Movie Ott Rights At Huge Price Details, Sudheer ,galodu, Ott Righ-TeluguStop.com

ఇకపోతే తాజాగా రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో సుధీర్ హీరోగా నటించిన చిత్రం గాలోడు. ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇప్పటికే ఈ సినిమా దాదాపు నాలుగు కోట్ల వరకు షేర్ రాబట్టాయని చిత్ర బృందం వెల్లడించారు.ఇలా రోజురోజుకు ఈ సినిమాకు ఎంతో మంచి ఆదరణ రావడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా మంచి లాభాలను తీసుకువచ్చిందని దర్శక నిర్మాతలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ గురించి ప్రస్తుతం వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ ఏకంగా నాలుగు కోట్లకు కైవసం చేసుకున్నట్లు సమాచారం.

Telugu Galodu, Ott, Sudheer, Sudheer Galodu-Movie

ఒకవైపు ఈ సినిమా థియేటర్లలో మంచి కలెక్షన్లను రాబట్టి లాభాలను తీసుకురావడమే కాకుండా డిజిటల్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్మడబోవడంతో చిత్ర బృందం ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.త్వరలోనే ఈ సినిమా డిజిటల్ రైట్స్ గురించి అధికారికంగా వెల్లడించనున్నారు.ఇక సుధీర్ ఇదివరకే సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్, వాంటెడ్ పండు గాడ్ వంటి సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు.అయితే మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో గాలోడు చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో చిత్ర బృందంతో పాటు అభిమానులు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube