రష్మీతో సుధీర్ డబుల్ మీనింగ్ డైలాగ్స్.. ఏం జరిగిందంటే..?

బుల్లితెర జోడీలలో ఒకటైన సుధీర్ రష్మీ జోడీ ఏళ్లు గడుస్తున్నా బుల్లితెరపై తమ హవాను కొనసాగిస్తూ ఫ్యాన్ బేస్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.ఢీ, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలలో ఈ జోడీ చేసున్న సందడి అంతాఇంతా కాదు.

 Sudheer Double Meaning  Dailogues On Rashmi Dhee Show Promo Goes Viral, Double M-TeluguStop.com

తాజాగా ఢీ షో ప్రోమో రిలీజ్ కాగా ఆ ప్రోమోలో సుధీర్ చెప్పిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ ప్రోమోకే హైలెట్ అయ్యాయి.రష్మీ సుధీర్ ను ర్యాగింగ్ చేయడానికి ప్రయత్నిస్తే రివర్స్ లో సుధీర్ రష్మీని ర్యాగింగ్ చేయడం గమనార్హం.

ఈ నెల 9వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుండగా ప్రోమోలో రష్మీ, దీపికా పిల్లి కాలేజీలో చదువుతున్న సీనియర్ అబ్బాయిలుగా సుధీర్, హైపర్ ఆది జూనియర్ అబ్బాయిలుగా స్కిట్ చేశారు.అయితే సుధీర్ రష్మీని చూసి శారీలో మీరు చాలా బాగున్నారని హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుందని సుధీర్ చెప్పుకొచ్చారు.

సుధీర్ అలా చెప్పడంతో రష్మీ తెగ సిగ్గు పడ్డారు.అబ్బాయి క్యారెక్టర్ అని చెప్పినా రష్మీ సిగ్గు పడ్డారంటూ ప్రదీప్ పంచ్ లు వేశారు.

ఆ తరువాత స్కిట్ లో భాగంగా ఆది, సుధీర్ అమ్మాయిల్లా సిగ్గు పడుతూ ఎంట్రీ ఇచ్చారు.

రష్మీ సుధీర్ తో ఫ్రెషర్సా అని అడగగా సుధీర్ ఫ్రెష్ అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పారు.ఆ తరువాత పేర్లు చెప్పమంటే ఆది తన పేరు ఆదమ్మ అని సుధీర్ పేరు సూదమ్మ అని చెబుతాడు.

దీపికా పిల్లి ఆదిని పాట పాడమని అడగగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా అంటూ ఆది పాట పాడతాడు.

దీపికా పిల్లి మీరు ఊర్లో ఏం చేస్తుంటారని అడగగా సుధీర్ మేము ఊర్లో విత్తనాలు వేస్తూ ఉంటామని చెప్పగా నువ్వు విత్తనాలు వేస్తే ఎవరు కోస్తారంటూ రష్మీ అడుగుతుంది.అక్కే విత్తనాలు కోసుకుంటుందంటూ ఆది మళ్లీ పంచ్ వేస్తాడు.

ఆ తరువాత రష్మీ తీన్నార్ స్టెప్పులు వేసి షోలో రచ్చరచ్చ చేశారు.రష్మీ ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టారని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube