రష్మీ వల్లే నాకు ఈ జీవితం, ఆమెకు నా జీవితం అంకితమన్న సుధీర్‌

బుల్లి తెరను షేక్‌ చేస్తున్న వారిలో సుడిగాలి సుధీర్‌ ఒకరు.ఆయన ఎక్కడ ఉంటే అక్కడ రష్మి ఉండాల్సిందే.

 Sudheer Comments Onrashmi-TeluguStop.com

వీరిద్దరి జోడీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ అయ్యింది.స్టార్‌ హీరో హీరోయిన్స్‌ కాంబో కంటే రష్మి సుధీర్‌ల కాంబోను జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు అంటే అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

ప్రస్తుతం వీరిద్దరు కూడా సినిమాలతో కూడా చాలా బిజీగా ఉన్నారు.బుల్లి తెరపై వీరిద్దరి కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో పండిపోతుంది.

దాంతో వీరు నిజంగానే ప్రేమలో ఉన్నారేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Telugu Sudheer, Sudheerrashmi, Sudheer Rashmi-

వీరిద్దరు తమ ప్రేమ విషయాన్ని ఎప్పటికప్పుడు కొట్టి పారేస్తూనే ఉన్నారు.మా ఇద్దరి మద్య ఎలాంటి బాండింగ్‌ లేదని, మేము ఏం చేసినా కూడా కేవలం కెమెరా ముందు వరకే అంటూ చెప్పుకొస్తున్నారు.తాజాగా అలీతో జాలీగా అనే కార్యక్రమంలో సుధీర్‌ పాల్గొన్నాడు.

ఆ సందర్బంగా అలీ మాట్లాడుతూ సుధీర్‌ నుండి రష్మీకి సంబంధించిన విషయాలను ప్రేమ విషయాలను రాబట్టేందుకు ప్రయత్నించాడు.

Telugu Sudheer, Sudheerrashmi, Sudheer Rashmi-

రష్మీ గురించి సుధీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.తమ ఇద్దరి మద్య ఎలాంటి ప్రేమ లేదని చెబుతూనే ఆమె నాకు జీవితం ఇచ్చింది.ఆమె వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను.

ఆమెతో నా కెమిస్ట్రీ సూపర్‌ హిట్‌ అవ్వడం వల్ల నాకు మంచి పేరు వచ్చింది.రష్మి కూడా చాలా కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చింది.

ఆమె అంటే నాకు చాలా గౌరవం.గతంలో తామిద్దరం పెద్దగా మాట్లాడుకునే వాళ్లం కాదు.

కాని ఈమద్య కాలంలో అప్పుడప్పుడు ఫోన్‌లు చేసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube