కామెడీకి చేస్తే సుడిగాలి సుధీర్‌ జీవితమే నాశనం అయ్యేలా ఉంది  

Sudheer Comments On His Real Character-jabardasth,rashmi,sudheer

తెలుగు బుల్లి తెర కమెడియన్‌ సుడిగాలి సుధీర్‌ ఏ స్థాయిలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను దక్కించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ముఖ్యంగా ఈయన రష్మితో చేసే రొమాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతారు.వారిద్దరి మద్య రియల్‌ లవ్‌ ఉంది అంటూ ఎంతో కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి...

Sudheer Comments On His Real Character-jabardasth,rashmi,sudheer-Sudheer Comments On His Real Character-Jabardasth Rashmi

కాని ఇద్దరు కేవలం కెమెరా కోసమే అలా నటిస్తున్నట్లుగా పదే పదే చెప్పారు.అయినా కూడా సుధీర్‌, రష్మిలు పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే అంతా అనుకుంటున్నారు.

Sudheer Comments On His Real Character-jabardasth,rashmi,sudheer-Sudheer Comments On His Real Character-Jabardasth Rashmi

ఇక జబర్దస్త్‌ మరియు ఢీ షోల్లో సుధీర్‌ ఒక అమ్మాయిల పిచ్చోడు అంటూ ప్రచారం చేస్తూ కామెడీ చేయడం జరిగింది.సుధీర్‌ అంటే అమ్మాయిలు ఎక్కడ ఉంటే అక్కడ ఉండి పులిహోర కలుపుతూ ఉంటాడు అంటూ టాక్‌ ఉంది.

సుధీర్‌ను టార్గెట్‌ చేసి ఎంతో మంది కమెడియన్స్‌ కామెడీ పండించే ప్రయత్నం చేశారు.అలా కామెడీకి చేస్తే ఇప్పుడు సుడిగాలి సుధీర్‌ పెద్ద కష్టాల్లో చిక్కుకున్నాడు.ఆయన ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలుకుంటే అమ్మాయిలే కరువయ్యారట..

తాజాగా సుడిగాలి సుధీర్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను బయట ప్రచారం జరుగుతున్నట్లుగా అమ్మాయిల పిచ్చివాడిని కాదని, అలా కామెడీ స్కిట్‌లు వస్తున్న కారణంగా నాకు పెళ్లి అవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.నిజంగానే నేను అమ్మాయిల పిచ్చివాడిని అన్నట్లుగా జనాలు నమ్ముతున్నారు అంటూ తన బాధను వెళ్లడించాడు.తన అసలు క్యారెక్టర్‌ అది కాదని బయట జరుగుతున్న ప్రచారంకు నా నిజ జీవితంకు అసలు సంబంధం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.సుడిగాలి సుధీర్‌ను ఇప్పటికైనా ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకునేందుకు సిద్దం అవుతుందో చూడాలి.