బయటకొచ్చిన రక్షకుడు.. వెంటే వస్తున్న రాక్షసుడు

నేచురల్ స్టార్ నాని తొలిసారి విలన్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వి – ది సేవియర్’పై ఇప్పటికే టాలీవుడ్‌లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఈ సినిమాలో మరో హీరో సుధీర్ బాబు కూడా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

 Sudheer Babu V Savior Mohan Krishna-TeluguStop.com

ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.కాగా ఈ సినిమాలోని సుధీర్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నేడు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ సినిమాలో సుధీర్ బాబు పాజిటివ్ రోల్‌లో నటిస్తోండగా నాని నెగెటివ్ రోల్‌లో నటిస్తున్నాడు.కాగా సుధీర్ బాబు ఫస్ట్ లుక్ చూస్తుంటే ఈ సినిమాలో యాక్షన్‌కు ఎలాంటి కొదువ లేదనేది వ్యక్తమవుతోంది.

చాలా సీరియస్ లుక్‌లో సుధీర్ బాబు సరికొత్తగా కనిపిస్తున్నాడు.రక్షకుడిగా సుధీర్ కనిపిస్తుండగా, రాక్షసుడిగా నాని నటిస్తున్నాడు.

సుధీర్ బాబు ఫస్ట్ లుక్‌ను నేడు రిలీజ్ చేయగా నాని ఫస్ట్ లుక్‌ను మంగళవారం రిలీజ్ చేస్తున్నారు.

Telugu Nani, Sudheer Babu, Telugu, Savior-

మరి ఈ సినిమాలో నాని పాత్ర ఎలా ఉంటుందా అనే ఆసక్తి సర్వత్రా ఏర్పడింది.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూ్స్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.నివేదా థామస్, అదితి రావు హైదరి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మార్చి 25న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube