రంగస్థలం తరహా కథని సుధీర్ బాబు కోసం సిద్ధం చేసిన పలాస దర్శకుడు

పలాస 1978 సినిమాతో దర్శకుడుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన వ్యక్తి కరుణకుమార్.మొదటి సినిమా కోసమే రఫ్ సబ్జెక్టు తీసుకొని, కొత్త హీరోతో పెర్ఫార్మెన్స్ చేయించుకొని సక్సెస్ కొట్టాడు.

 Sudheer Babu To Act In A Rugged Village Drama, Tollywood, Telugu Cinema,  Palasa-TeluguStop.com

ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లా అయిన శ్రీకాకుళంలో కులాల మధ్య ఉండే ఆధిపత్య పోరుకి ప్రేమకథ మిళితం చేసి తెరపై ఆవిష్కరించారు.ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.

అలాగే ఇందులో రఘుకుంచె అందించిన రెండు ఉత్తరాంధ్ర జానపథాలు అయితే ప్రస్తుతం ట్రెండింగ్ సాంగ్స్ గా మారిపోయాయి. కథ, కథనంతో పాటు హీరోయిజం కూడా ఎలివేట్ చేసిన కరుణకుమార్ దర్శకత్వ ప్రతిభకి అందరూ ఫిదా అయిపోయారు.

తాజాగా అతను మెట్రో కథలు అనే వెబ్ సిరీస్ చేశాడు.అయితే ఇది అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు.

ఇదిలా ఉంటే పలాస దర్శకుడు నెక్స్ట్ సినిమాని సుధీర్ బాబుతో కన్ఫర్మ్ చేసుకున్నాడు.ఇప్పటి వరకు స్టైలిష్ పాత్రలలోనే ఎక్కువగా కనిపించిన సుధీర్ బాబుని పక్కా పల్లెటూరి కుర్రాడిగా మార్చే పనిలో కరుణ కుమార్ ఉన్నట్లు తెలుస్తుంది.

రంగస్థలం, పలాస సినిమాల తరహాలోనే రఫ్ ఎలిమెంట్ తోనే ఈ సినిమా కూడా ఉండబోతుందని తెలుస్తుంది.పీరియాడిక్ కథాంశం ఆధారంగానే సుధీర్ బాబుతో తెరకెక్కించే కథని సిద్ధం చేసి అతనిని దర్శకుడు మెప్పించినట్లు సమాచారం.

త్వరలో ఈ సినిమా గురించి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావడంతో పాటు సెట్స్ పైకి కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.ఈ సినిమా తర్వాత వచ్చే గోపీచంద్ బయోపిక్ ని సుధీర్ బాబు సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube