సుధీర్ బాబు కెరియర్ లో హయ్యెస్ట్.. జీ నెట్ వర్క్ తో శ్రీదేవి సోడా సెంటర్ గ్రేట్ డీల్..!

సూపర్ స్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో సుధీర్ బాబు తన సొంత టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పించడానికి కష్టపడుతున్నాడు.ఈమధ్యనే సరైన ట్రాక్ లోకి వచ్చినట్టు కనిపిస్తున్న సుధీర్ బాబు ప్రస్తుతం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.

 Sudheer Babu Ssc Movie Digital Satellite Business Details, Business, Digital, La-TeluguStop.com

శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలు చేస్తున్నాడు.ఈ రెండు సినిమాలు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో వస్తున్నాయి.

పసాల సినిమాతో డైరక్టర్ గా తన టాలెంట్ చూపించిన కరుణ కుమార్ డైరక్షన్ లో వస్తున్న శ్రీదేవి సోడా సెంటర్ సినిమా దాదాపు షూటింగ్ పూర్తయిందని తెలుస్తుంది.ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడయినట్టు టాక్.

జీ నెట్ వర్క్ సుధీర్ బాబు సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను కొనేసిందని తెలుస్తుంది.ఈ సినిమాను 9 కోట్లకు కొనేసిందట జీ నెట్ వర్క్.

సుధీర్ బాబు కెరియర్ లో డిజిటల్, శాటిలైట్ రైట్స్ ఈ రేంజ్ లో అమ్ముడవడం ఇదే మొదటిసారి.సుధీర్ బాబు కెరియర్ లో హయ్యెస్ట్ బిజినెస్ చేస్తుంది శ్రీదేవి సోడా సెంటర్.

సినిమాను 70 ఎం.ఎం ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శషి దేవి రెడ్డి నిర్మిస్తున్నారు.సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ భారీ రేటుకి అమ్ముడవడంతో చిత్రయూనిట్ ఫుల్ జోష్ లో ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube