పలాస 1978 ఫేం కరుణ కుమార్ డైరక్షన్ లో సుధీర్ బాబు, ఆనంది జంటగా నటిస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. లైటింగ్ సూరి బాబుగా సుధీర్ బాబు, సోడాల శ్రీదేవిగా ఆనంది కనిపించనున్నారు.
సినిమాకు మణిశర్మ అందిస్తున్న మ్యూజిక్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుంది.ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు మాస్ లుక్ మాస్ ఆడియెన్స్ ను మెప్పించేలా ఉంది.
సినిమాలో కొన్ని రిస్కీ షాట్స్ కూడా సుధీర్ బాబు చేసినట్టు తెలుస్తుంది.
అయితే లేటెస్ట్ గా ఈ సినిమాలో ఓ మెసేజ్ కూడా ఉందని టాక్ బయటకు వచ్చింది.
సినిమాలో మెయిన్ ప్లాట్ అదేనని అంటున్నారు.ప్రస్తుత సమాజంలో జరిగే బర్నింగ్ టాపిక్ తోనే ఈ సినిమా కథ ఉంటుందని.
దానికి తగిన ఒక మెసేజ్ కూడా ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తుంది.పలాస సినిమాతో డైరక్టర్ గా తన టాలెంట్ చూపించిన కరుణ కుమార్ తప్పకుండా శ్రీదేవి సోడా సెంటర్ తో కూడా హిట్టు కొట్టేలా ఉన్నాడు.
సుధీర్ బాబు మాస్ లుక్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తుంది.ఈ సినిమాతో పాటుగా సమ్మోహనం డైరక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణతో సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా చేస్తున్నాడని తెలిసిందే.