జాతరలో సోడా తాగుతున్న సుధీర్ బాబు  

Sudheer Babu Sridevi Soda Center Motion Poster, Sudheer Babu, Sridevi Soda Center, Motion Poster, Tollywood News - Telugu Motion Poster, Sridevi Soda Center, Sudheer Babu, Tollywood News

యంగ్ హీరో సుధీర్ బాబు నటించే సినిమాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే.ఆయన చేసే సినిమాలు, ఎంచుకునే కథలు ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అవుతుండటంతో ఆయన వరుసబెట్టి సినిమాలను చేస్తూ వస్తున్నాడు.

TeluguStop.com - Sudheer Babu Sridevi Soda Center Motion Poster

ఇటీవల నేచురల్ స్టార్ నాని నటించిన ‘వి’ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించిన సుధీర్ బాబు, ఈసారి పక్కా పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు.

శ్రీదేవి సోడా సెంటర్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు.

TeluguStop.com - జాతరలో సోడా తాగుతున్న సుధీర్ బాబు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.ఈ పోస్టర్‌లో సుధీర్ బాబు జాతరలో కరెంటు అందించే వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు.

ఇక ఆయన శ్రీదేవి సోడా సెంటర్‌లో సోడా తాగుతూ ఇచ్చిన పోజుకు ప్రేక్షకులు ఇంప్రెస్ అవుతున్నారు.ఇలాంటి పక్కా విలేజ్ బ్యాక్‌డ్రాప్ కథను చూసి చాలా రోజులైందని, ఈ మోషన్ పోస్టర్‌తో సుధీర్ బాబు మరోసారి విలేజ్ వాతావరణాన్ని గుర్తుకు చేశాడంటూ వారు పొగిడేస్తున్నారు.

ఇక ఈ మోషన్ పోస్టర్‌కు ‘మనోడు లైటింగ్ ఎడితే ఊరంతా మెరిసిపోద్ది’ అంటూ సుధీర్ బాబు కామెంట్ పెట్టడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడుతోంది.

సూరిబాబు అనే పాత్రలో సుధీర్ బాబు నటించే తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇక ‘పలాస్ 1978’ చిత్రంతో అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్న కరుణ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా అనే ఆసక్తి అప్పుడే ప్రేక్షకుల్లో నెలకొంది.కాగా ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు నిర్మాతలు వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

#Sudheer Babu #Motion Poster #SrideviSoda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sudheer Babu Sridevi Soda Center Motion Poster Related Telugu News,Photos/Pics,Images..