నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది.ఇప్పటికే సినిమా షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
కానీ ప్రస్తుతం నెలకొన్న లాక్డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.ఇక ఈ సినిమాలో నానితో పాటు మరో యంగ్ హీరో సుధీర్ బాబు కూడా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
నాని తన కెరీర్లోనే తొలిసారి విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.
ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు అదిరిపోయే సిక్స్ ప్యాక్‌తో కనిపిస్తున్నాడు.తాజాగా సుధీర్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సిక్స్ ప్యాక్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.
ఈ లుక్‌లో సుధీర్ బాబు చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తు్న్నాడు.ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్ చూస్తే ఇందులో దిమ్మతిరిగే సస్పెన్స్, ట్విస్టులు ఉన్నట్లు తెలుస్తోంది.
దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అదితి రావు హైదరీ, నివేథా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.కాగా ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ ఉండటంతో వాయిదా పడింది.లాక్డౌన్ పూర్తవ్వగానే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.