పలాస దర్శకుడుతో నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్న సుధీర్ బాబు

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు అంటూ వెళ్లకుండా కొత్తదనం ఉన్న కథలతో ప్రయోగాలు చేస్తూ మరో వైపు తన హీరోయిజం కూడా ఎలివేట్ అయ్యే విధంగా చూసుకుంటున్న హీరో సుధీర్ బాబు.సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ బ్యాగ్రౌండ్ ఉన్న కూడా ఏ మాత్రం ఉపయోగించుకోకుండా సొంతగా తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు.

 Sudheer Babu Next Movie With Palasa Fame Karuna Kumar, Tollywood, Palasa 1978, S-TeluguStop.com

తాజాగా సుధీర్ బాబు ఇంద్రగంటి వి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకున్నా సుధీర్ బాబు చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది.

అలాంటి పవర్ ఫుల్ పోలీస్ రోల్స్ కి సుధీర్ బాబు పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు.ఇదిలా ఉంటే సుధీర్ బాబు ఎప్పటి నుంచో అనుకుంటున్న పుల్లెల గోపీచంద్ బయోపిక్ ని డిసెంబర్ లో సెట్స్ పైకి తీసుకొని వెళ్లబోతున్నాడు.

మరో వైపు ఇంకో కొత్త సినిమాకి కూడా సుధీర్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.పలాస సినిమాతో మంచి దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న కరుణకుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.

అతను చెప్పిన కథ నచ్చడంతో చేయడానికి ఒకే చెప్పాడు. 70ఎం.

ఎం.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది.ఈ ప్రొడక్షన్ లో సుధీర్ బాబు భ‌లే మంచి రోజు చేశాడు.ఆ సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఈ నేపధ్యంలో అదే ప్రొడక్షన్ లో రెండో సినిమాకి కమిట్ అయ్యాడు.ఇక ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

సుధీర్ బాబు కోసం దర్శకుడు కరుణ కుమార్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కమర్షియల్ స్టోరీని సిద్ధం చేసాడని తెలుస్తుంది.ఈ సినిమాకి సంబందించి ఒక‌ట్రెండు రోజుల్లో అధికారిక ప్ర‌క‌ట‌న వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube