ఇంట్రో కోసం రెండు కోట్లు.. సుధీర్ బాబుతో పాట్లు!

నేచురల్ స్టార్ నాని, యంగ్ హీరో సుధీర్ బాబు కలిసి నటిస్తున్న చిత్రం ‘వి’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ప్రముఖ దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Sudheer Babu Introduction Scene Cost 2 Crore-TeluguStop.com

ఇక రీసెంట్‌గా ఈ సినిమాలోని సుధీర్ బాబు, నానిల ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయడంతో అంచనాలు మరింత పెరిగాయి.

కాగా ఈ సినిమాలో హీరోగా సుధీర్ బాబు కనిపిస్తాడని, విలన్ పాత్రలో నాని కనిపిస్తాడని చిత్ర యూనిట్ తెలిపింది.

దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.అయితే ఈ సినిమాలో సుధీర్ బాబు ఇంట్రొడక్షన్ సీన్‌ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.ఏకంగా ఈ సీన్ కోసం రూ.2 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.పాతబస్తీలో ఓ పోలీస్ సెట్‌ను దీని కోసం రూపొందించారట చిత్ర యూనిట్.ఇక్కడ ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించనున్నారట చిత్ర యూనిట్.

ఈ సీన్‌లోనే సుధీర్ బాబు ఎంట్రీ ఉంటుందని, నానితో ఆయన చేసే యాక్టింగ్‌కు ఫుల్ మార్కులు పడతాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా నివేదా థామస్, అదితి రావు హైదరీ నటిస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

ఈ సినిమాను మార్చి 25న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube