ఇది నేనే చేశా... నమ్మండ్రా బాబు అంటున్న సుదీర్ బాబు

టాలీవుడ్ లో పరిచయం అక్కరలేని పేరు హీరో సుదీర్ బాబు.రెగ్యులర్ హీరోలకి భిన్నంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న ఈ యువ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు బావ అనే విషయం అందరికి తెలిసిందే.

 Sudheer Babu Interesting Stunt-TeluguStop.com

అయితే మహేష్ బావ అయిన అతని ఇమేజ్ ని ఏ మాత్రం ఉపయోగించుకోకుండా తనకంటూ ఒక యునిక్ వే ని బిల్డప్ చేసుకొని మంచి కథలతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.సుదీర్ బాబు చివరిగా చేసిన రెండు సినిమాలో మంచి హిట్స్ అందుకున్నాయి.

ఇక ప్రస్తుతం చేతిలో ఇంద్రగంటి దర్శకత్వంలో నానితో కలిసి చేస్తున్న సినిమా ఒకటి ఉండగా, మరొకటి బ్యాట్మెంటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ ఒకటి.ఈ రెండు సినిమాలతో ఫుల్ బిజీగా సుదీర్ బాబు ఉన్నాడు.

ఇక సుదీర్ బాబు సినిమాలతో తన లుక్, బోడిని ఎప్పుడు పెర్ఫెక్ట్ గా ఉంచుకోవడానికి వర్క్ అవుట్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాడు.అదే సమయంలో జిమ్నాస్టిక్స్ కూడా చేస్తాడు.

స్వతహాగా క్రీడాకారుడు కావడం వలన అన్ని రకాల వర్క్ అవుట్స్ పై దృష్టి పెడుతూ ఉంటాడు.ఈ నేపధ్యంలో తాజాగా ఎలాంటి ఆధారం లేకుండా గాల్లో ఆసనాలు వేసినట్లు ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఇవి మార్ఫింగ్ కాదని నిజంగా నిజమైన ఫోటోలు ఆంటూ నన్ను నమ్మండి అంటూ ఫన్నీగా కామెంట్స్ పెట్టాడు.తాను గాల్లో ఎగిరే సమయంలో ఈ ఫోటోలు క్లిక్ చేయడంతో ఇలా గాల్లో ఆసనాలు వేసినట్లు వచ్చాయని తెలుస్తుంది.

ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube