ఫిలిం స్టూడియో పెడుతున్న హీరో

టాలీవుడ్‌లో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న యంగ్ హీరో సుధీర్ బాబు, ప్రస్తుతం ‘వి’ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే రిలీజ్‌కు రెడీ అయ్యింది.

 Sudheer Babu To Launch Film Studio, Sudheer Babu, Film Studio, V Movie, Padmalay-TeluguStop.com

నేచురల్ స్టార్ నానితో పాటు సుధీర్ బాబు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఇక ఈ సినిమా ఖచ్చితంగా అదిరిపోయే సక్సెస్ కొడుతుందని ఈ హీరో ఆశిస్తున్నాడు.

కాగా త్వరలోనే ఓ ఫిలిం స్టూడియోను పెట్టే యోచనలో ఈ కుర్ర హీరో ఉన్నట్లు తెలుస్తోంది.

తనకు ఎప్పటినుండో ఒక ఫిలిం స్టూడియో పెట్టాలనే కోరిక ఉన్నట్లు సుధీర్ బాబు ఇప్పటికే పలుమార్లు చెప్పుకొచ్చాడు.

కాగా తన బావ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో వ్యాపారాలను హ్యాండిల్ చేస్తుండటంతో, తాను ఓ ఫిలిం స్టూడియో పెట్టాలని కుటుంబ సభ్యులతో చెప్పుకొచ్చాడు.వారు కూడా అతడికి సపోర్ట్ ఇవ్వడంతో ఇప్పుడు ఈ స్టూడియోను ఏర్పాటు చేసే పనిలో పడ్డాడట.

దీనికి సంబంధించి మంచి స్థలాన్ని కూడా సుధీర్ బాబు వెతుకుతున్నాడట.

మొత్తానికి యంగ్ హీరో సుధీర్ బాబు ఫిలిం స్టూడియో ఏర్పాటు చేస్తుండటంతో సినిమా షూటింగ్‌లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, చిన్న బడ్జెట్ సినిమాలకు కూడా అందుబాటులో ఈ ఫిలిం స్టూడియో ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇక నిర్మాతగా కూడా మారిన సుధీర్ బాబు ఈ ఫిలిం స్టూడియోతో ఎలాంటి లాభాలను సాధిస్తాడో చూడాలి.అటు తన మామ సూపర్ స్టార్ కృష్ణ పద్మాలయ స్టూడియో అధినేత అనే విషయం అందరికీ తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube