మహేష్ బాబు గురుంచి సుధీర్‌ బాబు ఆలా అన్నాడేంటి     2018-06-13   04:12:20  IST  Raghu V

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు సోదరి భర్త కావడం వల్లే సుధీర్‌బాబు హీరో అయ్యాడు అనే విషయం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. సుధీర్‌ బాబు గురించి ప్రేక్షకులు, మీడియాలో చర్చ జరుగుతుంది అంటే అది కృష్ణ మరియు మహేష్‌బాబు వల్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు. సుధీర్‌బాబు ఎలాంటి సినిమా చేసినా కూడా మహేష్‌బాబు మరియు కృష్ణలు చూసి ఆహా ఓహో అనాల్సిందే. ఇంటి అల్లుడు కనుక సధీర్‌బాబును వారిద్దరు నెత్తిన పెట్టుకుని వస్తున్నారు. సుధీర్‌బాబు నటించిన ప్రతి ఒక్క సినిమాకు కూడా మహేష్‌బాబు ఏదో ఒక రకంగా పబ్లిసిటీ చేస్తూనే ఉన్నాడు. తాజాగా ‘సమ్మోహనం’ సినిమా ప్రమోషన్‌లో కూడా మహేష్‌బాబు పాల్గొన్నాడు.

మహేష్‌బాబు ఇంతగా సుధీర్‌బాబు కోసం, ఆయనకు సక్సెస్‌లు దక్కాలనే ఉద్దేశ్యంతో సాయం చేసేందుకు ముందుకు వస్తుంటే ఆయన మాత్రం పెద్దగా పట్టించుకోనట్లుగానే వ్యవహరిస్తున్నాడు. తనకు మహేష్‌బాబు వల్లే గుర్తింపు వచ్చిందని కొందరు అనుకుంటున్నారు. అది వాళ్ల బ్రమ. నాకు బిజినెస్‌లు చెప్పలేనన్ని ఉన్నాయి. ఆ బిజినెస్‌లు చూసుకుంటూ ఉంటే జీవితం రాయల్‌గా గడిచి పోతుందని, కాకుంటే సినిమా అంటే ఇష్టంతో నేను బిజినెస్‌ను వదిలేసి సినిమాు చేస్తున్నాను, నాకు మహేష్‌బాబు, మామయ్య కృష్ణ గార్ల ప్రమోషన్స్‌ కూడా అక్కర్లేదు అని, అవకాశాల ఎంపిక విషయంలో కూడా తాను ఎప్పుడు వారిని సంప్రదించను అంటూ చెప్పుకొచ్చాడు.