అఫిషియల్: సుధీర్‌ బాబు "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి".. ఎవరితోనో తెలుసా?

సుధీర్ బాబు హీరోగా కొత్త సినిమా షురూ కాబోతుంది.ఇప్పటికే సినిమా పట్టాలెక్కినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.

 Sudheer Babu And Mohaka Krishna Indraganti Movie Title-TeluguStop.com

అయితే అధికారికంగా మాత్రం సినిమాను నేడు ప్రకటించబోతున్నారు.ఇప్పటికే మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్‌ బాబు రెండు సినిమాలు చేశాడు.

అందులో సమ్మోహనం సూపర్‌ హిట్ గా నిలిచింది.కాని ‘వి‘ సినిమా మాత్రం నిరాశ పర్చింది.

 Sudheer Babu And Mohaka Krishna Indraganti Movie Title-అఫిషియల్: సుధీర్‌ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. ఎవరితోనో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పైగా ఆ సినిమా లో నాని హీరో అవ్వడం వల్ల సుధీర్ బాబుకు పెద్దగా గుర్తింపు వచ్చిందే లేదు.సమ్మోహం సినిమా తర్వాత మళ్లీ తన నటన ప్రతిభను కనబర్చిన సుధీర్ బాబు తో అదే రేంజ్ లో విభిన్నమైన సినిమాను తీయాలనే ఉద్దేశ్యంతో మోహన కృష్ణ సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు.

క్లాస్ స్టోరీని కాస్త మాస్ టచ్ ఇచ్చి చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఈ టైటిల్‌ ను నేడు లాంచనంగా ప్రకటించబోతున్నారు.సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్‌ లుక్ ను కూడా రివీల్‌ చేస్తారని అంటున్నారు.పెద్ద ఎత్తున ఉన్న అంచనాల నేపథ్యంలో ఈ సినిమా ను విభిన్నమైన స్క్రీన్‌ ప్లేతో సినిమాను నడిపించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా స మాచారం అందుతోంది.మోహనకృష్ణ ఇంద్రగంటి గత సినిమా వి నిరాశ పర్చినా కూడా వెంటనే సినిమాను చేసేందుకు ముందుకు రావడం నిజంగా అభినందనీయం అంటున్నారు.

సుధీర్ బాబు కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమా లు చేయాలనే ఉద్దేశ్యంతో ఇంద్రగంటి దర్శకత్వంలో సినిమా ను వెంటనే కమిట్ అయ్యాడు.సుధీర్ బాబుకు ఈ సినిమా సక్సెస్ ఎంతో కీలకం.

అందుకే మోహన కృష్ణ ఇంద్రగంటి ఈ సినిమా ను ప్రత్యేక జాగ్రత్తలతో తీస్తున్నట్లుగా చెబుతున్నారు.

#TollywoodMovie #MohanaKrishna #Sudheer Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు