సుధీర్ బాబు సినిమా.. నానీ సినిమాకు కాపీనా?

భిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు సుధీర్ బాబు.ఘట్టమనేని బ్యాగ్రౌండ్ వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

 Sudheer Babu Aa Ammai Gurinchi Neeku Cheppali Copied Nani Shyam Singha Roy Movie-TeluguStop.com

మహేష్ బాబు ఫ్యామిలీ కి అస్సలు అలవాటు లేని డాన్సులు కూడా ఇరగదీస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.ఫిట్ నెస్ విషయంలో అయితే సుధీర్ బాబు ఎంత కష్టపడతాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇటీవలే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు.ఇప్పటికే సమ్మోహనం లాంటి హిట్ అందించిన దర్శకుడు మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి ఈ సినిమాను తెరకెక్కిస్తు ఉండటం గమనార్హం.

ఇటీవలే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’అనే సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేయగా ఈ టీజర్ కాస్త ప్రస్తుతం యూట్యూబ్లో అందరినీ ఆకర్షిస్తోంది.అయితే ఇందులో సుధీర్ బాబు పాత్ర ఎంతో ఆసక్తికరంగా ఉండబోతుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది.

రోల్ సౌండ్ కెమెరా యాక్షన్ అంటూ చెప్తూ ఉంటే ఈ టీజర్ మొదలవుతుంది.టీజర్ చూసుకుంటే సుధీర్ బాబు హిట్ సినిమాలు తీసిన దర్శకుడిగా నటిస్తూ ఉంటాడు సుధీర్ బాబు.

ఆ తర్వాత తనకు నచ్చిన కథ చేయాలి అనుకుంటాడు.ఆ కథ ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతోంది.

దీనికోసం ఒక బ్యూటిఫుల్ ప్రిన్సెస్ కావాలి అనుకుంటాడు.ఇంతలో కృతి శెట్టి పరిచయమవుతుంది.

Telugu Aaammai, Copied, Herinekrithi, Sudheer Babu, Nani-Movie

మీరే ఈ సినిమా చేయాలి అంటూ కృతి శెట్టి ని అడిగి పట్టుబట్టి మరీ ఒప్పిస్తాడు.అంతా బాగానే ఉంది కానీ ఇదంతా చూస్తుంటే ఎక్కడో కాపీ కొట్టినట్లు ఉంది అని ప్రేక్షకులు అనిపిస్తుంటుంది.ఎక్కడో కాదు నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో ఇలాంటి సన్నివేశం ఉంటుంది.ఈ సినిమాలో కూడా హీరోయిన్ కి సినిమాలు అంటే అస్సలు ఇష్టం ఉండదు.

Telugu Aaammai, Copied, Herinekrithi, Sudheer Babu, Nani-Movie

హీరో బలవంతంగా ఒప్పిస్తాడు.విషయం ఏంటంటే ఇక శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా హీరోయిన్ కృతి శెట్టి కావడం గమనార్హం.దీంతో ఇక ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ టీజర్ చూస్తుంటే శ్యామ్ సింగరాయ్ లోని సన్నివేశం అందరికీ మైండ్ లో తిరుగుతుంది.దీంతో కథలో పెద్దగా కొత్తదనం ఏమీ లేదు అనుకుంటున్నారట ప్రేక్షకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube