బిగ్ బాస్ 3 లో స్పెషల్ ఎట్రాక్షన్ గా ఆ ఇద్దరి జంట! టాలీవుడ్ హాట్ టాపిక్

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 కి రంగం సిద్ధం అయ్యింది.ఇక ఈ షోకి వ్యాఖ్యతగా నిర్వాహకులు ఇప్పటికే కుస్తీలు పడుతున్నారు.

 Sudheer And Rashmi Gautham In Bigg Boss 3-TeluguStop.com

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీ కావడం, నాని షో చేయడానికి ఆసక్తి చూపించకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఈ సారి నాగార్జున పేరు వినిపిస్తుంది.ఇంకా అతని పేరు అధికారికంగా కన్ఫర్మ్ కాకునా అతనే ఫైనల్ అనే మాట వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ షో పాల్గొనే వారి గురించి టాలీవుడ్ లో గత కొద్ది రోజులుగా ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా మరో హాట్ న్యూస్ ఇప్పుడు ఫిలిం నగర్ లో వైరల్ గా మారుంది.

ఈ షో కోసం హాట్ యాంకర్ జబర్దస్త్ రష్మితో పాటు, జబర్దస్త్ నటుడు, యాంకర్ సుదీర్ జంటని తీసుకోవాలని బిగ్ బాస్ టీం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.ఇక వారిద్దరి కోసం ఎక్కువ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.

అయితే వెళ్ళు యాంకర్స్ గా బిజీగా వున్నారు.దీంతో వీళ్ళు ఎంత వరకు బిగ్ బాస్ హౌస్ కి రావడానికి ఇష్టపడతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఏది ఏమైనా ఈ సారి బిగ్ బాస్ సీజన్ 3 మాత్రం కాస్తా పేరున్న సెలబ్రిటీలతో మరింత మసాలాతో పాటు సందడి ఉండే అవకాశం ఉందని టాక్ మాత్రం వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube