శ్రీదేవి డ్రామా కంపెనీ సదా సందడి.. పాత రోజుల్లో అలా?

బుల్లితెరలో ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.ఇప్పటికే బుల్లితెర మొత్తం షో లతో నిండగా.

 Sudheer Aadi Sada Extraordinary Performance In Shridevi Drama Company-TeluguStop.com

ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో కూడా అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ అందుకుంది.ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

అన్ని రకాల పర్ఫామెన్స్ లతో బాగా సందడి చేస్తున్నారు.ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ షో మొత్తం పండగ వాతావరణంలా కనిపిస్తుంది.

 Sudheer Aadi Sada Extraordinary Performance In Shridevi Drama Company-శ్రీదేవి డ్రామా కంపెనీ సదా సందడి.. పాత రోజుల్లో అలా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రతి ఎపిసోడ్ కు ఎవరో ఒకరిని గెస్ట్ గా పిలిపించి సందడి చేస్తారు.ఇదిలా ఉంటే ఇందులో హీరోయిన్ సదా కూడా పాల్గొని పాతరోజుల్లో కి వెళ్ళిపోయింది.

ఇదిలా ఉంటే ఈ షో లో వచ్చే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో బాగా సందడి కనిపించింది.ఇక ఇందులో ఇంద్రజ, వరుణ్ తేజ్ నటించిన ఇందువదన టీమ్, సదా తో పాటు పలువురు కమెడియన్స్, సెలబ్రెటీలు పాల్గొన్నారు.

తమ పర్ఫామెన్స్ లతో బాగా అదరగొట్టారు.ఇదిలా ఉంటే ఇంద్రజ లాలి.లాలి.అనే పాటతో బాగా ఆకట్టుకుంది.

భాను, వర్ష తమ డాన్స్ స్టెప్పులతో రచ్చ చేశారు.ఇక సదా మాత్రం తన డాన్స్ తో అందర్నీ జయం సినిమాలోకి తీసుకెళ్ళింది.

వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా సదా ప్రేక్షకులకు మరింత దగ్గరగా ఉంది.ఇక తాజాగా ఈమె కూడా పర్ఫామెన్స్ లో పాల్గొని.‘రాను రానంటూనే చిన్నదో‘ అనే పాటకు చిందులేసింది.20 ఏళ్ల తర్వాత మళ్లీ వేదికపై ఈ పాటతో కనిపించినా సదా పాత రోజుల్లోకి తీసుకెళ్ళింది.అప్పటి స్టెప్పులతో అందర్నీ అలరించింది.ఈమె డాన్స్ చేస్తున్న సమయంలో అక్కడున్న వాళ్లతో పాటు ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేశారు.

ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారగా.సదా డాన్స్ వీడియోని చూసిన అభిమానులు సూపర్ అంటూ సదా ఈస్ బ్యాక్ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.అంతేకాకుండా ఈ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నామని అంటున్నారు నెటిజన్లు.

#Varuntej #Sada #Induvadana Team #Promo #SrideviDrama

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు