ఇంకు పడ్డాక ఇంకా భయమెందుకు?

నిండా మునిగాక ఇంకా చలి ఎందుకు అన్నట్లు నిలువెల్ల ఇంకు (సిరా) పడిన ఇంకా ఎందుకు భయపడాలి? అని అనుకున్నారు ప్రముఖ పత్రికా రచయిత, అబ్జర్వర్ రీసర్చ్ ఫౌండేషన్ చైర్మన్ సుధీంద్ర కులకర్ణి.ఈయన ఈ మధ్య వార్తల్లో వ్యక్తీ అయిన సంగతి తెలిసిందే.

 Sudheendra Kulkarni To Visit Pakistan-TeluguStop.com

పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి కుర్షీద్ మహమూద్ కసౌరీ రాసిన పుస్తకాన్ని ముంబైలో ఈయన ఆవిష్కరించాలని ప్లాన్ చేసారు.ఈ సంగతి తెలుసుకున్న శివసేన నాయకులు కుండెడు ఇంకు తీసుకు వచ్చి కులకర్ణి నెత్తి మీద పోశారు.

నువ్వు పాకిస్తాన్ వాడి పుస్తకం ఇక్కడ ఆవిష్కరిస్తావా అని మండి పడ్డారు.వచ్చే నెలలో కసౌరీ పుస్తకాన్ని పాకిస్తాన్లో ఆవిష్కరిస్తున్నారు.

నవంబర్ 2వ తేదీన ఈ కార్యక్రమం కరాచీలో జరుగుతుంది.దీనికి హాజరు కావాలని కులకర్ణి నిర్ణయించుకున్నారు.

ఎలాగో ఇంకు పోశారు కదా.ఇంకా ఎందుకు భయపడటం అనుకున్నారు.ఇది శివసేనకు కోపం తెప్పించే విషయమే.సుధీంద్ర కులకర్నీ ఒకప్పుడు భాజపాకు దగ్గరివాడు.ఎల్కే అద్వానీకి అత్యంత సన్నిహితుడు.ఆయనకు ప్రసంగాలు రాసి పెట్టేవారు.

ఇప్పుడు కాషాయ పార్టీతో సంబంధాలు లేనట్లు కనబడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube