దేశంలో గ్రామాల దత్తతకు ముందుకొచ్చిన భారత సంతతి వైద్యుల సంఘం

60,000 మంది భారత సంతతి వైద్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (ఏఏపీఐ) అమెరికాలో వెనుకబడిన గ్రామాలను దత్తత తీసుకునే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కానుంది.‘‘అడాప్ట్ ఏ విలేజ్’’ కింద ఏఏపీఐ ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఆరోగ్య సంరక్షణ మరియు ఇతర ప్రాథమిక సౌకర్యాలను అందిస్తోంది.

 Sudhakar Jonnalagadda Backward Villages-TeluguStop.com

తెలంగాణలోని బూర్గుల గ్రామంలో మెడికల్ క్లినిక్‌తో పాటు తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించింది.

మాతృభూమి రుణాన్ని తీర్చుకోవడానికి తామంతా భారతదేశంలో పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నట్లు ఏఏపీఐ అధ్యక్షుడు సుధాకర్ జొన్నలగడ్డ తెలిపారు.

ఇటీవల భారత్‌లో పర్యటించిన ఆయన గ్రామీణ భారతంలో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి టాట్ ట్రస్ట్ భాగస్వామ్యంతో ఏఏపీఐ కృషి చేస్తోందని వెల్లడించారు.దేశంలో దాదాపు 75 శాతం మంది పేదలు గ్రామాల్లో నివసిస్తున్నారని, వారు ప్రాథమిక వైద్య సంరక్షణ పొందలేక పోతున్నారని సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Telugu Iadopt, Telugu Nri Ups-

దేశంలో క్యాన్సర్ వ్యాధి బాధితులు ఏ యేటికాయేడు పెరుగుతున్నారు.ప్రతి సంవత్సరం 1.9 మిలియన్ కొత్త కేసులు నమోదవుతున్నాయని ఆయన తెలిపారు.చాలా సందర్భాల్లో రోగ నిర్థారణ ఆలస్యం కారణంగా చికిత్సను కొన్నేళ్ల పాటు కొనసాగించాల్సి వస్తుందన్నారు.

క్యాన్సర్ రోగుల్లో 50 శాతానికి పైగా మూడో దశలోనే ఎక్కువ మంది వైద్యుడిని సంప్రదిస్తున్నారని సుధాకర్ తెలిపారు.టాటా ట్రస్ట్‌తో కలిసి పనిచేయడం ద్వారా భారతదేశంలోని టాటా క్యాన్సర్ ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఏఏపీఐ సభ్యులు శస్త్రచికిత్స, రేడియేషన్, వంటి సాయం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

కమ్యూనిటీ ప్యూర్ వాటర్ ఫౌండేషన్‌తోనూ ఏఏపీఐ పనిచేస్తుందని డాక్టర్ సుధాకర్ చెప్పారు.

ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం నీటి నాణ్యత సూచీలో 122 దేశాలలో భారత్ 120వ స్థానంలో ఉంది.

దేశంలో సుమారు 70 శాతం కలుషిత నీరు సరఫరా అవుతోంది.తద్వారా ఇది ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది మరణానికి కారణమవుతుందని సుధాకర్ తెలిపారు.

దేశీయంగా లభ్యమయ్యే సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడం ద్వారా నీటిని కలుషితం చేసే కారకాలను తొలగించేందుకు ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలకు ఏఏపీఐ తగిన సాయం చేస్తుందన్నారు.యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ సహకారంతో 2025 నాటికి క్షయ నిర్మూలనే లక్ష్యంగా తాము భారత ప్రభుత్వానికి సాయం చేస్తామన్నారు.

విశాఖపట్నంలో బ్రెయిన్ ట్యూమర్ వ్యాధిగ్రస్తులకు చికిత్సను అందించేందుకు గాను ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టామని సుధాకర్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube