చీర కట్టిందని ఊరు మహిళా అని ఎగతాళి చేసారు..! వారికి ఆమె ఇచ్చిన కౌంటర్ హైలైట్..!       2018-06-10   00:23:10  IST  Raghu V

ఇన్ఫోసిస్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ సుధా మూర్తి గురించి తెలుసు క‌దా. ఇన్ఫోసిస్ కో ఫౌండ‌ర్ నారాయ‌ణ మూర్తి భార్య ఆమె. ఈమె గేట్స్ ఫౌండేష‌న్ కార్య‌క‌లాపాల్లో కూడా భాగ‌స్వామిగా ఉన్నారు. అయితే సుధా మూర్తి ఓ పుస్త‌కం రాశారు. త‌న జీవితంలో జ‌రిగిన ప‌లు విష‌యాల‌ను కూడా అందులో ప్ర‌స్తావించారు. త్రీ థౌసండ్ స్టిచెస్‌: ఆర్డిన‌రీ పీపుల్‌, ఎక్స్‌ట్రార్డిన‌రీ లైవ్స్ అనే పుస్త‌కాన్ని రాసిన ఆమె త‌న విష‌యాల‌ను అందులో తెలియ‌జేశారు. అయితే ఆ పుస్త‌కంలో ఆమె త‌న జీవితంలో జ‌రిగిన ఓ ముఖ్య సంఘ‌ట‌న గురించి వివ‌రించారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సుధామూర్తి ఓ సారి లండ‌న్ నుంచి బెంగుళూరుకు ప్ర‌యాణ‌మ‌య్యారు. అందుకు గాను బిజినెస్ క్లాస్ టిక్కెట్ల‌ను బుక్ చేసుకున్నారు. ఈ క్ర‌మంలో లండ‌న్‌లోని హీత్రూ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్ట్‌కు ఆమె చేరుకున్నారు. అయితే సాధార‌ణంగా ఆమె ఎక్కువ‌గా చీర‌లే క‌డ‌తారు. కానీ ప్ర‌యాణాల్లో ఉంటే చుడీదార్ వేసుకుంటారు. ఆ స‌మ‌యంలో ఆ డ్రెస్ సౌక‌ర్యంగా ఉంటుంద‌ని ఆమె భావిస్తారు. అందుకే ఆ డ్రెస్ ఆ రోజు కూడా అదే డ్రెస్ వేసుకున్నారు. చూసేందుకు చాలా సాదా సీదాగా ఉంటారామె. త‌న డ్రెస్సింగ్ కూడా ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఆరోజు వేసుకున్న చుడీదార్ కూడా పెద్ద ఖ‌రీదైందేమీ కాదు. అయితే అలా ఆమె ఎయిర్‌పోర్టుకు వ‌చ్చాక కొంత సేపు వెయిట్ చేశారు. అనంత‌రం బోర్డింగ్ పాస్ తీసుకుని విమానం ఎక్కేందుకు లైన్లో నిల‌బ‌డ్డారు.

అయితే ఆమె ముందు ఒకామె (ఇండియ‌న్‌) నిలుచుంది. చాలా పోష్ డ్రెస్‌, ఆభ‌ర‌ణాలు వేసుకుని కంప్లీట్ మోడ్ర‌న్ లుక్‌లో త‌యారైంది. ఆమె వెనుక సుధా మూర్తి వ‌చ్చి నిల‌బ‌డింది. ఇక సుధా మూర్తి వెనుక ముందున్న‌ ఆమె ఫ్రెండ్ నిల‌బ‌డింది. ఆమె కూడా ముందున్న ఆమెలాగే మోడ్ర‌న్‌గా త‌యారైంది. అయితే సుధామూర్తి మాత్రం చాలా నిరాడంబ‌రంగా ఉండ‌డంతో ఆమెను చూసిన ఆ ముందున్న మ‌హిళ సుధామూర్తిని బోర్డింగ్ పాస్ చూపించ‌మ‌ని అడిగింది. ఎందుకు అని సుధామూర్తి అడ‌గ్గా, ఎందుకంటే ఇది బిజినెస్ క్లాస్ వాళ్లు వెళ్లే లైన్ కాబ‌ట్టి, మీలాంటి వారు ఎకాన‌మీ క్లాస్‌లో వెళ్తారు, కాబ‌ట్టి ఆ లైన్‌లో మీరు వెళ్లాలి, ఇందులో కాదు, అని ఆ మ‌హిళ అన‌గా, అందుకు సుధామూర్తి బ‌దులిస్తూ.. బిజినెస్ క్లాస్‌కి, ఎకాన‌మీ క్లాస్‌కి తేడా ఏముంటుంది అని తెలియ‌న‌ట్టు అడిగింది.

-

దీంతో ఆ ముందున్న మ‌హిళ బ‌దులిస్తూ.. బిజినెస్ క్లాస్ అంటే చాలా త‌క్కువ మంది ఉంటారు. విమానం త్వ‌ర‌గా ఎక్క‌వ‌చ్చు, త్వ‌ర‌గా దిగ‌వ‌చ్చు, లగేజ్ వేగంగా వ‌స్తుంది, విమానంలో బిజినెస్ క్లాస్ వాళ్లు త‌క్కువ‌గా ఉంటారు, అయిన‌ప్ప‌టికీ టాయిలెట్స్ ఎక్కువ‌గా ఉంటాయి. ఇక నిద్రొస్తే సీట్ల‌ను ప‌రుచుకుని ఎప్పుడంటే అప్పుడు నిద్రించ‌వ‌చ్చు, భోజ‌నం చాలా ఖ‌రీదైంది ఉంటుంది, క‌నుక మీ లాంటి వారు ఆ క్లాస్‌లో వెళ్ల‌లేరు. కాబ‌ట్టి ఇప్ప‌టికైనా ఎకాన‌మీ లైన్‌లో నిలుచోండి. అని ఆ ముందున్న మ‌హిళ సుధామూర్తికి చెప్పింది. అయితే సుధామూర్తి క‌ద‌ల్లేదు. చూద్దాం ఆమె ఏం చేస్తుందో అని అలాగే వేచి ఉంది. అయితే సుధామూర్తి ఎంత సేప‌టికీ క‌ద‌ల‌క‌పోయే స‌రికి ముందున్న మ‌హిళ సుధామూర్తి వెనుక నుంచుని ఉన్న త‌న ఫ్రెండ్‌తో.. వీరు మార‌రు. చెబితే విన‌రు. ఊరు నుంచి వ‌చ్చిన వారు ఇలాగే ఉంటారు.. అని కామెంట్ చేసింది. అయిన‌ప్ప‌టికీ త‌న‌ను కామెంట్ చేశార‌ని కూడా సుధామూర్తి ప‌ట్టించుకోలేదు.

-

చివ‌ర‌కు బోర్డింగ్ పాస్ చూపించే వంతు వీరిది అయింది. అయితే సుధామూర్తి ముందు, వెనుక ఉన్న ఇద్ద‌రు మ‌హిళలు బోర్డింగ్ పాసి చూపి లోప‌ల‌కి వెళ్లి వెయిట్ చేస్తున్నారు. సుధామూర్తి బోర్డింగ్ పాస్ చూపిస్తే క‌చ్చితంగా సిబ్బంది పంపేస్తారు, అని చెప్పి వారు అక్క‌డే ఎదురు చూడ‌సాగారు. అయితే అలా జ‌ర‌గ‌లేదు. ఎందుకంటే సుధామూర్తికి బిజినెస్ క్లాస్ టిక్కెట్ ఉంది క‌దా, ఆమెను ఎందుకు పంపుతారు, ఈ విష‌యం ఆ ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు తెలియ‌లేదు. దీంతో వారికి ఆశ్చ‌ర్యం వేసింది. అయితే అప్ప‌టికే బోర్డింగ్ పాస్ చూపించి సుధా మూర్తి లోప‌లికి వచ్చేసింది. వెంట‌నే ఆ ఇద్ద‌రు మ‌హిళ‌ల వ‌ద్దకు వెళ్లి మాట్లాడుతూ.. నేను ఊరి మ‌హిళ‌నే. కానీ మీరు క్లాస్ మ‌నుషులు మాత్రం కాదు. ఒక మ‌నిషికి క్లాస్ అనేది తాను సంపాదించే డ‌బ్బును బ‌ట్టి, అలంక‌ర‌ణ‌ల‌ను బ‌ట్టి రాదు. తాను చేసే మంచి పనుల‌తో క్లాస్ వ‌స్తుంది. అంతే కానీ డ‌బ్బు దాన్ని తెచ్చివ్వ‌లేదు.. అని చెప్పి అక్క‌డి నుంచి సుధామూర్తి వెళ్లిపోయింది…! దీంతో ఆ మ‌హిళ‌ల‌కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అవును మ‌రి, సుధామూర్తి అన్న‌ది క‌రెక్టే క‌దా. డ‌బ్బుతో ఎక్క‌డైనా గుణం వ‌స్తుందా, క్లాస్‌గా ఉంటారా..? అది స్వ‌త‌హాగా రావాలి, వారు చేసే ప‌నుల‌ను బ‌ట్టి ఉంటుంది..!