అన్నకి హిట్ ఇచ్చిన దర్శకురాలికి తమ్ముడు గ్రీన్ సిగ్నల్

ఆకాశం నీ హద్దురా సినిమాతో సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకోవడంతో పాటు చాలా గ్యాప్ తర్వాత హీరో సూర్యకి హిట్ ఇచ్చిన దర్శకురాలు సుధా కొంగర.ప్రస్తుతం ఈ దర్శకురాలి పేరు కోలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది.

 Sudha Kongara's Next Film Will Be With Karthi, Tollywood, Kollywood, Hero Surya,-TeluguStop.com

స్వతహాగా తెలుగు దర్శకురాలు అయిన మణిరత్నం శిష్యురాలిగా తమిళ సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్న ఈమె నెక్స్ట్ సినిమాని అజిత్ తో ప్లాన్ చేసింది.ఈ సినిమా స్క్రిప్ట్ కూడా ఇప్పటికే అజిత్ ఫైనల్ చేశాడు.

అయితే ఆ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్తుందని అందరూ భావించారు.అంతకంటే ముందుగా సుధా కొంగర సూర్య తమ్ముడు హీరో కార్తీతో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.

దీనికి సంబంధించి డిస్కషన్ కూడా ఫైనల్ అయినట్లు టాక్ వినిపిస్తుంది.

రీసెంట్ గా సుధా కొంగర కార్తీకి కథ చెప్పడం జరిగిందని, అతను కూడా వెంటనే ఒకే చెప్పేసినట్లు బోగట్టా.

రియలిస్టిక్ కథలని తెరకెక్కించే దర్శకురాలిగా సుధాకి మంచి పేరు ఉంది.అలాగే రియలిస్టిక్ కథలని ఎక్కువగా ఇష్టపడే హీరోగా కార్తీకి గుర్తింపు ఉంది.వీరిద్దరి కలయికలో సినిమా అంటే కచ్చితంగా అది కూడా ఒక రియలిస్టిక్ స్టోరీ అయ్యి ఉంటుందని కోలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.ప్రముఖ నిర్మాత సంస్థ ఈ కాంబినేషన్ సినిమాని నిర్మించేందుకు ముందుకి వచ్చినట్లు సమాచారం.

ప్రస్తుతం కార్తీ సుల్తాన్ షూటింగ్ లో ఉన్నాడు.దీనిని పూర్తి చేసిన వెంటనే సుధా సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది.

త్వరలో ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube