Sudha Kongara: నేషనల్ అవార్డు విన్నర్ ఇలాంటి చెత్త మూవీ తీశారా… సీరియల్ కంటే దారుణం..

ప్రస్తుతం ఇండియాలో టాప్ డైరెక్టర్స్ గా కొనసాగుతున్న చాలా మంది దిగ్గజ దర్శకులు తమ కెరీర్‌ను చిన్న చిత్రాలతో ప్రారంభించారు.వీరు ఆ సినిమాలు తీసినట్లు కూడా ఎవరికీ తెలియదు.

 Sudha Kongara Worst Movie Andhra Andagadu-TeluguStop.com

ఎందుకంటే అవి పెద్దగా హిట్ కాలేదు.ఉదాహరణకు, బాహుబలి( Baahubali ) వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు చేయడానికి ముందు ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouli ) ఒక టీవీ సీరియల్‌కి దర్శకత్వం వహించాడు.

ఆ సీరియల్ పేరు చాలా కొద్ది మందికే తెలుసు.అంత చిన్న బిగినింగ్స్ నుంచి వీరు తమ కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడి ఓపికగా పనిచేశారు.

అలాంటి దర్శకులలో దర్శకురాలు సుధా కొంగర( Director Sudha Kongara ) ఒకరు.ఆమె రీసెంట్‌ ఇయర్స్‌లో ఆకాశం నీ హద్దు రా( Aakaasam Nee Haddhu Ra ) (తమిళంలో సూరరై పొట్రు) సినిమాతో హిట్ సాధించింది.

అంతేకాదు ఈ మూవీ జాతీయ అవార్డును( National Award ) గెలుచుకుంది.సుధా కొంగర వెంకటేష్ తో గురు చిత్రం( Guru Movie ) తీసి మరో హిట్ అందుకుంది.

సూర్య వంటి స్టార్ నటులతో ఆమె కలిసి పని చేసింది.ఆమె తన తమిళ చిత్రం “ఇరుధి సుత్రు”కి రీమేక్ అయిన గురు చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది.

అయితే సుధా కొంగర తెలుగులో పేరున్న దర్శకురాలిగా అవతరించక ముందు ఓ స్మాల్ ఫిల్మ్ తీసిన సంగతి చాలా మందికి తెలియదు.ప్రముఖ తెలుగు కమెడియన్ కృష్ణ భగవాన్, శ్రీ తేజ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ స్మాల్ ఫిల్మ్ పేరు ‘ఆంధ్ర అందగాడు’.

( Andhra Andagadu ) ఈ సినిమాకు సంబంధించిన వీడియో క్లిప్‌లు ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

Telugu Aakaasamnee, Andhra Andagadu, Sudha Kongara, Guru, Krishna Bagwan, Nation

అయితే ఈ ఫిల్మ్ చూసేవారెవరైనా దీనికి దర్శకత్వం వహించింది

సుధా కొంగర

( Sudha Kongara ) అని తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు.ఎందుకంటే ఆ మూవీ అంత చెత్తగా ఉంది.ఇది సినిమా కంటే సీరియల్ లా ఉందని చెప్పుకోవచ్చు.

దీనికి ప్రధాన కారణం ప్రొడ్యూసర్ పెద్దగా డబ్బులు పెట్టడానికి సాహసించకపోవడం అని చెప్పుకోవచ్చు.తక్కువ ప్రొడక్షన్ వ్యాల్యూ గురించి పక్కనపెట్టినా ఈ మూవీ కథ కూడా గొప్పగా ఏమీ ఉండదు.

ఇది సుధా కొంగర ప్రతిభను, దృష్టిని ప్రతిబింబించదు.మరి ఇలాంటి వేస్ట్ మూవీ ఆమె ఎందుకు తీసింది? అనేది ఆమెకే తెలియాలి.తరువాత ఈ లేడీ డైరెక్టర్ తన సత్తా చాటింది.అవార్డు గెలుచుకున్న, విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలను చేసింది.

Telugu Aakaasamnee, Andhra Andagadu, Sudha Kongara, Guru, Krishna Bagwan, Nation

విజయం రాత్రికి రాత్రే వచ్చేది కాదని దీన్నిబట్టి అర్థమవుతోంది.దీనికి అంకితభావం, పట్టుదల, మెరుగుదల అవసరం.సుధా కొంగర తన అభిరుచిని వదులుకోలేదు.తన లక్ష్యాలను కొనసాగించింది.తమిళ సూపర్ స్టార్ సూర్యతో( Surya ) కొత్త సినిమా అనౌన్స్ చేసిన ఆమె ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్.ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.

వారి సెకండ్ కాంబినేషన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube