నెక్స్ట్ అజిత్ సినిమాని పట్టాలు ఎక్కించబోతున్న సుధా కొంగర  

Sudha Kongara to team up with Ajith, Kollywood, Tollywood, South Cinema, Telugu Director, Madhavan, Sudha Kongara, Ajith, Rithika Sing, Venkatesh - Telugu Ajith, Kollywood, Madhavan, Rithika Sing, South Cinema, Sudha Kongara, Telugu Director, Tollywood, Venkatesh

దర్శకురాలిగా కెరియర్ స్టార్ట్ చేసింది తెలుగులోనే అయినా తరువాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సక్సెస్ అయ్యి తమిళంలో మాధవన్, రితికా సింగ్ తో ఇరుద్ది సుట్రు సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకురాలు సుధా కొంగర.ఇదే సినిమాని వెంకటేష్ తో తెలుగులో గురుగా రీమేక్ చేసి ఇక్కడ కూడా హిట్ కొట్టింది.

TeluguStop.com - Sudha Kongara To Team Up With Ajith

అయితే తెలుగు హీరోల నుంచి చాన్సులు వచ్చిన కూడా కమర్షియల్ హంగులు పేరుతో కథలో వేలు పెడతారని, దర్శకత్వంలో ఫ్రీడమ్ ఉండదని భావించిన సుధా కొంగర మరల కోలీవుడ్ వెళ్ళిపోయి అక్కడ హీరో సూర్యతో ఆకాశం నీ హద్దురా అనే సినిమాని తెరకెక్కించింది.ఈ సినిమా రియల్ బిజినెస్ మెన్ బయోపిక్ అనే విషయం చాలా ఆలస్యంగా బయటకి వచ్చింది.

ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఎప్పుడో రిలీజ్ కి రెడీ అయ్యింది.త్వరలో ఓటీటీ ద్వారా ఈ సినిమా విడుదల కాబోతుంది.

TeluguStop.com - నెక్స్ట్ అజిత్ సినిమాని పట్టాలు ఎక్కించబోతున్న సుధా కొంగర-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ సినిమా తర్వాత ఆమె మళ్ళీ తమిళంలోనే సినిమా చేయబోతుంది.అది కూడా స్టార్ హీరో అజిత్ తో.ఇప్పటికే ఆమె అజిత్ కి ఓ కథ చెప్పి ఒకే చేయించుకుంది.ఈ సినిమాని ప్రముఖ నిర్మాత గోకులం గోపాలన్‌ నిర్మిస్తున్నారు.

ఈ కథ కూడా చాలా రియలిస్టిక్ గా ఉండే విధంగా సుధా ప్లాన్ చేస్తున్నారు.భారీ బడ్జెట్ తో ఈ సినిమా ద్విభాషా చిత్రంగా తెరకెక్కించడానికి దర్శకురాలు సుధా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం అజిత్ వినోద్ దర్శకత్వం వాలిమై సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా పూర్తికాగానే సుధా కొంగర సినిమా సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తుంది.

త్వరలో ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

#Ajith #Sudha Kongara #Madhavan #Kollywood #Venkatesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sudha Kongara To Team Up With Ajith Related Telugu News,Photos/Pics,Images..