కోలీవుడ్ లో పాగా వేస్తున్న తెలుగు మహిళా దర్శకురాలు  

Sudha Kongara Next Movie With Hero Vijay - Telugu Hero Vijay, Kollywood, Sudha Kongara Next Movie, Tollywood

సినిమా ఇండస్ట్రీలో మహిళా దర్శకురాలు అంటే చాలా తక్కువ మంది పేర్లు వినిపిస్తాయి.తెలుగులో అయితే ఒక భానుమతి, విజయ నిర్మల, బి జయ లాంటి పేర్లు మాత్రమే ఎక్కువగా వినిపిస్తాయి.

Sudha Kongara Next Movie With Hero Vijay

టాలీవుడ్ లో మగాళ్ళతో సమానంగా దర్శకులుగా వీళ్ళు తమ సత్తా నిరూపించుకున్నారు.వీళ్ళ స్ఫూర్తితో చాలా మంది మహిళా దర్శకురాళ్ళు ఈ మధ్య కాలంలో టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు.

అయితే ఒక్కరు కూడా అనుకున్న స్థాయిలో హిట్ కొట్టలేకపోతున్నారు.ఇదిలా ఉంటే ఈ జెనరేషన్ లో సుధా కొంగర పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

అప్పుడెప్పుడో 13 ఏళ్ల క్రితం తెలుగులో ఆంధ్రా అందగాడు అనే చిన్న సినిమాతో దర్శకురాలిగా సుధా కొంగర పరిచయం అయ్యారు.అయితే ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా ఎవరికీ తెలియదు.

తరువాత కోలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడ హీరో శ్రీరామ్, విష్ణు విశాల్ కాంబినేషన్ లో ద్రోహి అనే సినిమా తీసింది.ఆ సినిమా పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది.

అయితే మరల ఆరేళ్ళ గ్యాప్ తీసుకొని సాలా కద్దూస్ అనే సినిమాని మాధవన్ ని లీడ్ రోల్ లో పెట్టి, రియల్ బాక్సర్ అయిన రితికా సింగ్ ని నటిగా పరిచయం చేసింది.ఈ సినిమా తమిళం, హిందీలో సూపర్ హిట్ అయ్యింది.

దీంతో అదే దర్శకురాలు ఈ సినిమాని తెలుగులో వెంకటేష్ తో తీసి ఇక్కడ కూడా హిట్ కొట్టింది.అయితే టాలీవుడ్ హీరోలు ఈమెకి అవకాశాలు ఇచ్చేందుకు ముందుకి రాలేదు.

దీంతో మరల తమిళంలో విజయ్ హీరోగా ఆకాశం నీ హద్దురా అని ఓ రియల్ బిజినెస్ మెన్ స్టొరీని తెరపై ఆవిష్కరించింది.త్వరలో ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ తో సినిమా చేసే అవకాశాన్ని ఈమె సొంతం చేసుకుంది.మొత్తానికి వైజాగ్ నుంచి వచ్చి టాలీవుడ్ వద్ధనుకున్న దర్శకురాలికి కోలీవుడ్ అగ్రతాంబూలం ఇవ్వడం విశేషం.

తాజా వార్తలు

Sudha Kongara Next Movie With Hero Vijay-kollywood,sudha Kongara Next Movie,tollywood Related....