తన కలలకు గుడ్ బై చెప్పిన సుదీప్ త్యాగి..!

టీమిండియా బౌలర్ సుదీప్ త్యాగి టీమిండియా నుంచి తప్పుకున్నాడు.అన్ని రకాల ఫార్మేట్ లకు తాను వీడ్కోలు పలికాడు.

 Sudeep Tyagi Says Goodbye To His Dreamsudeep Tyagi, Cricket, Cricketar, Good Bye-TeluguStop.com

ఇందులో భాగంగానే తాను కన్న కలలకు వీడ్కోలు అంటూ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాడు.ఈ 33 సంవత్సరాల వ్యక్తి తన రిటైర్మెంట్ ను ప్రకటించిన సందర్భంగా, ముందుగా తనని సపోర్ట్ చేసిన వారందరికీ తన కృతజ్ఞతలు తెలిపాడు.

జాతీయ జట్టు జెర్సీ వేసుకొని ప్రతి ఆటగాడు కనే కల ను నేను పూర్తి చేసుకున్న అంటూ తెలుపుతూ.జాతీయ జెండాను కలలో కూడా నా గుండెలపై నే ఉంచుకుంట అంటూ తెలిపాడు.

నా జీవితానికి ఇది చాలు నా క్రీడా జీవితానికి ఇక సెలవు అని ఆయన తెలిపాడు.

తన బావోద్వేగ పూర్వకంగా ఉన్న మాటలను ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశాడు.

ఇందులో భాగంగా తాను మొదటి వన్డే మ్యాచ్ ను మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఆడినందుకు మహేంద్రసింగ్ ధోనికి కృతజ్ఞతలు తెలియజేశాడు.వీటితో పాటు తన రోల్ మోడల్స్ ఆయన సురేష్ రైనా, ఆర్ పి సింగ్, మహమ్మద్ కైఫ్ సరసన ఆడేందుకు అవకాశం లభించినందుకు తాను ఎంతో సంతోషంగా ఉన్నానని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నాడు.

గత సంవత్సరం వరల్డ్ కప్ లో జరిగిన న్యూజిలాండ్ తో చివరి మ్యాచ్ ఆడిన మహేంద్రసింగ్ ధోని కూడా అంతర్జాతీయ క్రికెట్ కు అన్ని ఫార్మర్స్ నుంచి తప్పుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.మహేంద్రసింగ్ ధోని ప్రకటన చేసిన వెంటనే సురేష్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలుకుతున్న అంటూ తెలిపిన సంగతి తెలిసిందే.తాజాగా యూఏఈ దేశంలో ఐపీఎల్ సీజన్ ముగియడంతో అటు నుంచి అటే టీమిండియా జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube