పవన్ కోసం మరో స్టార్ యాక్టర్.. ఎవరంటే?  

Sudeep In Talks For Pawan Kalyan Remake Movie, Sudeep, Pawan Kalyan, Oppayannum Koshiyum, Remake, Sagar K Chandra, Tollywood News - Telugu Oppayannum Koshiyum, Pawan Kalyan, Remake, Sagar K Chandra, Sudeep, Sudeep In Talks For Pawan Kalyan Remake Movie, Tollywood News

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తూ దూకుడును ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే.ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ చివరిదశ షూటింగ్‌ను జరుపుకోవాల్సి ఉండగా, తన నెక్ట్స్ చిత్రాలను ఇప్పటికే ఓకే చేస్తూ పవన్ అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాడు.

TeluguStop.com - Sudeep In Talks For Pawan Kalyan Remake Movie

ఈ క్రమంలో దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ఓ సినిమా, దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసినా ఇంకా షూటింగ్ మాత్రం మొదలుపెట్టలేదు.

TeluguStop.com - పవన్ కోసం మరో స్టార్ యాక్టర్.. ఎవరంటే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక ఈ తరుణంలో మరో సినిమాకు పవన్ పచ్చ జెండా ఊపేశాడు.మలయాళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ రెడీ అయ్యింది.

ఈ సినిమాలో హీరోగా పవన్ కళ్యాణ్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల అనౌన్స్ కూడా చేసింది.అయితే ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో నటించేందుకు తొలుత రానాను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించింది.

కానీ ఆ పాత్రలో ఎవరు నటిస్తున్నారనే విషయంపై ఇంకా చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.దీంతో తాజాగా ఈ సినిమాలో పవన్‌తో పాటు మరో స్టార్ యాక్టర్‌ను తీసుకునేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

కన్నడ స్టార్ యాక్టర్ కిచ్చ సుదీప్‌ను ఈ సినిమాలో తీసుకుంటే సినిమాకు మంచి క్రేజ్ దక్కుతుందని భావించిన చిత్ర యూనిట్ ఆ దశగా అడుగులు వేస్తోంది.సుదీప్‌ను ఈ సినిమాలో ఎలాగైనా నటించేందుకు ఒప్పించేలా చిత్ర యూనిట్ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో పవన్ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.ఈ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తుండగా సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూస్ చేయనున్నాడు.

#Sagar K Chandra #SudeepIn #Sudeep #Remake #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sudeep In Talks For Pawan Kalyan Remake Movie Related Telugu News,Photos/Pics,Images..