సినిమా రిలీజ్ చెయ్యలేదని ఫ్యాన్స్ బీభ‌త్సం?

Sudeep Explanation On Kotigobba 3 Release

తమ అభిమాన హీరోల సినిమాల కోసం అభిమానులు బాగా ఎదురుచూస్తుంటారు.కొత్త సినిమాలు రావడమే ఆలస్యం.

 Sudeep Explanation On Kotigobba 3 Release-TeluguStop.com

వెంటనే విడుదల రోజు థియేటర్ల ముందు ఎదురుచూస్తుంటారు.కొన్ని కొన్ని సందర్భాలలో ఆ సినిమా ఆలస్యమైతే మాత్రం థియేటర్ల పై దాడి చేస్తుంటారు.

ఇదిలా ఉంటే తాజాగా తమ అభిమాన హీరో సినిమా విడుదల కాలేదని ఫ్యాన్స్ బీభత్సం సృష్టించారు.

 Sudeep Explanation On Kotigobba 3 Release-సినిమా రిలీజ్ చెయ్యలేదని ఫ్యాన్స్ బీభ‌త్సం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కన్నడ సూపర్ స్టార్ హీరో సుదీప్ తాజాగా నటించిన సినిమా కోటిగొబ్బ -3. ఇక ఈ సినిమాకు ఫైనాన్స్, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల సినిమా విడుదల వాయిదా పడింది.ఇక గతంలో ఈ సినిమాను గురువారం రోజు విడుదల చేస్తామని ప్రకటించగా నిన్న థియేటర్ దగ్గర అభిమానులు ఈ సినిమా కోసం తెల్లవారి నుంచి ఎదురు చూశారు.

Telugu Fans, Kotigobba, Sudeep, Tollywood-Movie

దీంతో థియేటర్ లో ఈ సినిమా మధ్యాహ్నం కూడా విడుదల కాకపోయే సరికి అభిమానులు థియేటర్ల ఎదుట బీభత్సం సృష్టించారు.థియేటర్ల పై రాళ్లను విసిరేశారు.ఇక సుదీప్ ఈ గొడవకు స్పందించి క్షమాపణలు తెలిపాడు.ఈ సినిమా విడుదల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేసే పనిలో ఉన్నామని ఈ సినిమా శుక్రవారం రోజు విడుదలవుతుందని తెలిపాడు.

ఇక ఇందులో థియేటర్ల యాజమాన్యం పై ఎటువంటి తప్పులేదని దయచేసి థియేటర్లపై దాడి చేయవద్దు అని అభిమానులను కోరాడు.ఇటువంటి సమస్యలు మరోసారి జరగకుండా చూసుకుంటాను అని హామీ ఇచ్చాడు.

ఇక తను కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నానని తెలిపాడు.

#Kotigobba #Sudeep #Fans

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube