ఆర్‌ఆర్‌ఆర్‌లో ఈయన లేడట

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం షూటింగ్‌ చకచక జరుగుతుంది.ఈ చిత్రంలో బాలీవుడ్‌ నుండి కోలీవుడ్‌ వరకు అన్ని ఇండస్ట్రీలకు చెందిన వారు పలువురు నటిస్తున్న విషయం తెల్సిందే.

 Sudeep Comments On Rrr Movie-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో ఈగ ఫేం సుదీప్‌ నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.ఈగ చిత్రంలో సుదీప్‌ను జక్కన్న ఏ స్థాయిలో చూపించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇప్పుడు అదే తరహాలో ఈ చిత్రంలో కూడా ఒక కీలక పాత్రలో చూపించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని ఆ వార్తలు నిజం కాదని సుదీప్‌ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం కోసం నేను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.కాని నేను ఆ సినిమాలో నటిస్తున్నట్లుగా వచ్చిన వార్తలు నిజం కాదు.అసలు ఆ ప్రాజెక్ట్‌ కోసం నన్ను ఎవరు సంప్రదించలేదు.ఎందుకు ఇలాంటి వార్తలు వస్తున్నాయో నాకు అర్థం అవ్వడం లేదు అన్నాడు.

బాహుబలి చిత్రంలో ఒక చిన్న పాత్రను సుదీప్‌తో దర్శకుడు రాజమౌళి వేయించిన విషయం తెల్సిందే.కాని ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌లో మాత్రం ఆయనకు ఛాన్స్‌ ఇవ్వలేదని ఆయన మాటలతో క్లారిటీ వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube