అదృష్టం: వర్షం వచ్చింది.. కోటీశ్వరుడయ్యాడు!

నిజంగా కొందరు సంపాదించాలని.కోటీశ్వరులు అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.

 Sudden Rain, 158k Dollars Lottery Jackpot, America,lottery,lottery Jackpot-TeluguStop.com

కానీ ఫలించదు.అదేంటో మరి.కొందరు ఉన్నట్టుండి అదృష్టవంతులు అయిపోతారు.మొన్నటికి మొన్న ఓ వ్యక్తి తల్లితో షాపింగ్ కి వెళ్లి అనుకోకుండా కోటీశ్వరుడు అయ్యాడు.

ఇప్పుడు వర్షం పడుతుంటే దాని నుంచి తప్పించుకునేందుకు షాపింగ్ కి వెళ్లిన వ్యక్తి కోటీశ్వరుడయ్యాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

అమెరికాలోని వర్జీనియాకు చెందిన వ్యక్తి ఇటీవల బయటకు వచ్చాడు.అయితే అప్పుడే వర్షం మొదలైంది.

చేసేదేం లేకా రోడ్డు పక్కన ఓ చోట ఆగాడు.వర్షం నుంచి తప్పించుకోవాలంటే ఎం చెయ్యాలా అని ఆలోచిస్తుండగా ఎదురుగా ఓ షాపింగ్ మాల్ కనిపించింది.

దీంతో అతను నేరుగా ఆ మాల్ కి వెళ్ళాడు.

అలా అలా మాల్ చూస్తుంటే లాటరీ కనిపించింది.

దీంతో ఆ లాటరీ టికెట్ ని కొనుక్కొని జేబులో పెట్టుకున్నాడు.ఇంట్లో పెట్టి మర్చిపోయాడు.

అయితే లాటరీ ఫలితాలు వచ్చిన విషయం తెలుసుకున్న అతను తన దగ్గర ఉన్న టికెట్ తీసి చూడగా అతడు ఆశ్చర్యపోయాడు.ఎందుకంటే అతను కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు ఏకంగా 1,58,377 డాలర్లు అంటే ఇండియాన్ కరెన్సీలో ఏకంగా కోటి 18 లక్షల రూపాయిల నగదు బహుమతి వచ్చింది.

దీంతో ఆ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube