తన ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన సుద్దాల అశోక్ తేజ  

Suddala Ashok Teja gives Clarity on His Health, Tollywood, Telugu Cinema, South cinema, Corona effect, COVID-19, Corona virus - Telugu Corona Effect, Corona Virus, Covid-19, South Cinema, Suddala Ashok Teja Gives Clarity On His Health, Telugu Cinema, Tollywood

ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపిస్తున్న కరోనా మహమ్మారి దేశంలో కూడా తన ప్రతాపం చూపిస్తుంది.అవకాశం దొరికిన ప్రతి చోటకి వెళ్ళిపోతుంది.

 Suddala Ashok Teja Health Tollywood

బలహీనంగా ఉన్నవారిని కబలించేస్తుంది.ఇప్పటికే చాలా మంది ప్రముఖులు సైతం కరోనా బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు.

సామాన్యుల పరిస్థితి అయితే ఇక చెప్పాల్సిన పని లేదు.ఇంత తీవ్ర రూపం చూపిస్తున్న కరోనా బారిన పడ్డ ప్రముఖుల పరిస్థితిపై చాలా మంది ఆరా తీస్తున్నారు.

తన ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన సుద్దాల అశోక్ తేజ-General-Telugu-Telugu Tollywood Photo Image

గత కొంత కాలంగా ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ ఆరోగ్యం పట్ల విపరీతమైన ప్రచారం జరుగుతుంది.ఆయన కరోనా బారిన పడ్డారని వార్తలు వినిపించాయి.

ఈ నేపథ్యంలో తేజనే స్వయంగా తన ఆరోగ్యం గురించి ఒక వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు.

మీ అందరి ప్రేమ వల్ల, దయ వల్ల, ప్రభుత్వం అందించిన సహాయ సహకారాల వల్ల కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన తరవాత మెల్లమెల్లగా రోజురోజుకి నేను కోలుకుంటున్నాను.

మళ్లీ పాటలు రాస్తున్నాను.నేను చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాను.కాకపోతే, ఈ కరోనా ఉండటం వల్ల ప్రస్తుత పరిస్థితులను బట్టి ప్రజలందరి మాదిరిగానే జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది తప్ప నా ఆరోగ్యంలో ఎలాంటి ఇబ్బంది లేదు.అశోక్ తేజ ఆరోగ్యం మళ్లీ విషమంగా ఉందని వార్తల్లో వచ్చినట్టు తెలిసింది.వాటిలో నిజం లేదు.నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని వీడియోలో సుద్దాల అశోక్ తేజ వెల్లడించారు.

#Corona Effect #Corona Virus #COVID-19

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Suddala Ashok Teja Health Tollywood Related Telugu News,Photos/Pics,Images..