సుద్దాల అశోక్‌తేజ్‌కు లివర్ డొనేట్ చేసిన కొడుకు.. సర్జరీ సక్సెస్!  

Suddala Ashok Tej R Surgery Suddala Ashok - Telugu R Surgery, Suddala Ashok Health Condition, Suddala Ashok Tej, Tollywood News

టాలీవుడ్‌లో సినీ పాటల రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సుద్దాల అశోక్ తేజ ఆరోగ్యం గురించి గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఆయన కాలేయం సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని, దాని కోసం చికిత్స చేయించుకుంటున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

 Suddala Ashok Tej Liver Surgery Suddala Ashok

కాగా ఆదివారం నాడు ఆయన లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నారు.గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సర్జరీ సాయంత్రం 6 గంటల వరకు జరిగినట్లు వైద్యులు తెలిపారు.

సుద్దాల అశోక్ తేజ్ కుమారుడు తన లివర్‌ను కొంత భాగం డొనేట్ చేయడంతో ఈ సర్జరీ నిర్వహించారు.కాగా ప్రస్తుతం సుద్దాల అశోక్ తేజ, ఆయన కుమారుడు ఇరువురు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

సుద్దాల అశోక్‌తేజ్‌కు లివర్ డొనేట్ చేసిన కొడుకు.. సర్జరీ సక్సెస్-General-Telugu-Telugu Tollywood Photo Image

సుద్దాల సర్జరీ గురించి తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్నారు.కాగా సుద్దాల అశోక్ తేజ చిరంజీవి నటించిన ఠాగూర్ చిత్రానికి గాను జాతీయ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Suddala Ashok Tej Liver Surgery Suddala Ashok Related Telugu News,Photos/Pics,Images..

footer-test