అత్యంత కిరాతకంగా ప్రజలను పొట్టన పెట్టుకుంటున్న సైన్యం...

సైన్యం ప్రజలను కాపాడాల్సింది పోయి పొట్టన పెట్టుకోవడం ఏంటి అని ఆలోచిస్తున్నారా.నిజంగా సైన్యం ప్రజలను పొట్టన పెట్టుకున్న ఘటన సూడాన్ లో చోటుచేసుకుంది.

 Sudan Crises Pulling The 40 Bodies From Nail River-TeluguStop.com

ప్రజాస్వామ్య అనుకూల నిరసన పై అక్కడి సైన్యం ఉక్కుపాదం మోపుతోంది.ఈ క్రమంలో ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్‌(టీఎంసీ) వెలుపల నిరసన తెలుపుతున్న వేలాది మంది ప్రజలపై సైన్యం అత్యంత కిరాతకంగా కాల్పులు జరపడం తో ఇప్పటికే 101 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

అలానే ఈ ఘటనలో వందల మంది గాయపడినట్లు తెలుస్తుంది.గత నెల రోజులుగా సూడాన్ రాజధాని ఖర్తూమ్‌లో ప్రజలు ఆందోళనలు సాగిస్తున్నారు.

నిత్యావసరాల వాడుకపై నిషేధ ఆంక్షల ను విధించడం పై నిరసిస్తూ ప్రజలు ఉద్యమం చేపట్టారు.దేశ ఆర్థిక రంగం పూర్తిగా చితికిపోవడంతో ఏడాది క్రితం అప్పటి అధ్యక్షుడు బషీర్‌ అత్యవసర పొదుపు చర్యలు ప్రకటించారు.

అత్యంత కిరాతకంగా ప్రజలను పొట�

నిత్యావసర వస్తువుల పై కూడా ఆంక్షలు విధించడం తో ప్రజలు ఆందోళనలు చేపట్టారు.అయితే ఇవి పతాక స్థాయికి చేరడంతో సైన్యం జోక్యం చేసుకొని 30 ఏళ్లుగా అధికారంలో ఉన్న బషీర్‌ను తొలగించి ప్రభుత్వాన్ని తన అధీనంలోకి తీసుకుంది.అయినా, ప్రజలు తమ నిరసనలు ఆపకపోవడం తో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 40 మందిని చంపి నైలూ నదిలో పడేయడంతో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube