బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న వివాదాస్పద సింగర్..?  

suchitra ramadhurai wild card entry in bigg boss tamil season 4, singer suchitra ramadhurai, bigg boss tamil season4, kamal haasan, wild card entry,suchitra leaks - Telugu Bigg Boss Tamil Season4, Kamal Haasan, Singer Suchitra Ramadhurai, Suchitra Leaks, Suchitra Ramadhurai Wild Card Entry In Bigg Boss Tamil Season 4, Wild Card Entry

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 కొన్ని వారాల క్రితం తమిళంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే.తమిళంలో నటుడు కమల్ హాసన్ బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

TeluguStop.com - Suchitra Ramadhurai Wild Card Entry In Bigg Boss Tamil Season 4

ఈ షోలో వివాదాస్పద నటి, సింగర్ సుచిత్ర పాల్గొనబోతున్నారని సమాచారం.మూడు సంవత్సరాల క్రితం సుచీలీక్స్ తో సుచిత్ర సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.

సౌత్ ఇండియా అంతటా ఈమె లీక్ చేసిన ఫోటోలు, వీడియోలు చర్చనీయంశం అయ్యాయి.

TeluguStop.com - బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న వివాదాస్పద సింగర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

స్టార్ హీరోలు, హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్ల వ్యక్తిగత ఫోటోలోను బయటపెట్టి సుచిత్ర వార్తల్లో నిలిచింది.

ఇండస్ట్రీ వర్గాల్లో సుచిత్ర లీక్ చేసిన ఫోటోలు, వీడియోలు ప్రకంపనలు సృష్టించాయి.ఆ సమయంలో సుచిత్ర మానసిక స్థితి బాగోలేదని ఆమె కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చారు.

ఆమె సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అయ్యాయని కొందరు, ఆమె కావాలనే ఈ విధంగా చేసిందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే గత కొంతకాలంగా పెద్దగా వార్తల్లో వినిపించని సుచిత్ర బిగ్ బాస్ హౌస్ లో పాల్గొంటోందని వస్తున్న వార్తలు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

సింగర్ గా తెలుగు ప్రేక్షకులకు కూడా సుచిత్ర సుపరిచితమే.భర్తతో విడాకులు తీసుకున్న ఆమె కొన్ని ప్రైవేట్ ఆల్బమ్ లను చేస్తోంది.

అయితే వైరల్ అవుతున్న వార్తలు నిజమో కాదో తెలియాల్సి ఉంది.

ఇప్పటికే తమిళ బిగ్ బాస్ షోలో అర్చన చందోకే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వగా రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా సుచిత్ర అడుగుపెట్టనుంది.

ఆదివారం రోజున రేఖా హారిస్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.రేటింగులు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్లే సుచిత్రను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎంపిక చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

#Suchitra Leaks #SingerSuchitra #Wild Card Entry #Kamal Haasan #BiggBoss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Suchitra Ramadhurai Wild Card Entry In Bigg Boss Tamil Season 4 Related Telugu News,Photos/Pics,Images..