ఇలాంటి వాటి వల్ల ఇండియాకు పొంచివున్న ప్రమాదం.. ఐరాస హెచ్చరిక.. ?

మనిషి తన సౌకర్యాల కోసం ప్రకృతిని ఎంతలా నాశనం చేస్తున్నాడో ప్రపంచానికి తెలిసిందే.తాను సుఖంగా బ్రతకడం కోసం ప్రశాంతంగా ఉన్న పంచభూతాలను అల్లోకల్లోలంగా మార్చేశాడు.

 India, World, Dam, Danger Posed, Un Warns-TeluguStop.com

దీని ఫలితాన్ని క్రమక్రమంగా అనుభవిస్తున్నాడు.ఇకపోతే రానున్న రోజుల్లో ఇండియాకు పెద్ద ప్రమాద ముప్పు ఉందని ఐక్యరాజ సమితి హెచ్చరిస్తుంది.

కెనడా కేంద్రంగా యూఎన్ అధీనంలో పనిచేస్తున్న ఏజింగ్ వాటర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, యాన్ ఎమర్జింగ్ గ్లోబల్ రిస్క్ ఇనిస్టిట్యూట్ ఈ నివేదికను వెల్లడించిందట.

ప్రపంచవ్యాప్తంగా 1930 నుంచి 1970 మధ్య 58,700 ఆనకట్టలు భారతదేశంలో నిర్మితం అయ్యాయని, అవన్నీంటికి వయసు 50 నుంచి 100 సంవత్సరాలు మాత్రమేనని గుర్తు చేసింది.

ఇదిలా ఉండగా ఇండియాలోని వివిధ నదులపై నిర్మించిన 1000కి పైగా డ్యామ్ లు మరో ఐదేళ్లలో 50 సంవత్సరాల వయసును పూర్తి చేసుకుంటాయని, అందువల్ల వాటి సామర్ధ్యం తగ్గిపోయే అవకాశాలున్నాయని, కాబట్టి ఇవి ప్రమాదకర స్థాయికి చేరుకుంటాయని, ఇది ప్రపంచానికే పెను విపత్తు కావచ్చని ఐక్యరాజ్య సమితి తన తాజా నివేదికలో హెచ్చరించింది.

సో ఇవన్ని పునరుద్ధించాలంటే ఖర్చుతో కూడుకున్న పని.మరి ప్రభుత్వాలు గనుక సకాలంలో స్పందించకుంటే ఈ డ్యాముల చుట్టపక్కల ఉన్న గ్రామాలు ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube