దేవుడా.. కులాంతర వివాహం చేసుకున్నందుకు మరీ ఇంత భారీ జరిమానా..?!

ప్రస్తుత సమాజంలో అనేక చోట్ల కులాంతర వివాహాలు షరా మామూలే అయిపోయాయి.ఒకవైపు ఇలా నడుస్తున్న ప్రపంచమంతా అభివృద్ధి పరంగా దూసుకెళ్తున్నా మరోవైపు కొన్ని ప్రాంతాల్లో మాత్రం కులం మతం అంటూ ఇంకా వాటిని పట్టుకొని కొట్టుకు చస్తున్నారు.

 Such A Huge Fine For Inter Caste Marriage-TeluguStop.com

ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో కులం పేరుతో మనుషులను హింసించడం లేక వారిని తక్కువ చేసి చూడటం ఇలాంటివి జరుగుతూ ఉండటం మనం మీడియాలో ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం.ఇక తాజాగా ఇలాంటి విషయమే ఒడిశా రాష్ట్రంలోని ఆనందపూర్ సబ్ డివిజన్ లో ఉన్న ఖాలియామెంట గ్రామపంచాయతీలో ఓ సంఘటన చోటు చేసుకుంది.

ఆ ఊరిలో కులాంతర వివాహం చేసుకున్నారన్న విషయం కారణంగా ఒక కుటుంబానికి ఏకంగా 25 లక్షల 60 వేల రూపాయలు జరిమానా విధించారు ఆ గ్రామ పంచాయతీ పెద్దలు.అంతటితో ఆగకుండా ఆ కుటుంబాన్ని ఆ గ్రామం నుంచి వెలి వేశారు కూడా.

 Such A Huge Fine For Inter Caste Marriage-దేవుడా.. కులాంతర వివాహం చేసుకున్నందుకు మరీ ఇంత భారీ జరిమానా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ విషయం సంబంధించి.ఖాలియామెంట గ్రామానికి చెందిన మహేశ్వర్ బాస్కే అనే వ్యక్తి వేరే కులానికి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు.

లా వివాహం చేసుకున్న ఆ వ్యక్తి కొద్దీ రోజుల పాటు వేరే ఊరిలో జీవనం కొనసాగించాడు.అయితే ఇటీవల మహేశ్వర్ బాస్కే జంట వారు కులాంతర వివాహం చేసుకున్నందుకు గ్రామ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telugu 25 Lakhs 60 Thousand, Fine, Inter Caste Marraige, Odisha, Viral Latest, Viral News-Latest News - Telugu

ఈ విషయం సంబంధించి గ్రామ పెద్దలు పంచాయతీకి ఆ కులాంతర వివాహం చేసుకున్న కుటుంబానికి ఏకంగా 25 లక్షల 60 వేల భారీ జరిమానా విధించారు.ఇందుకు సంబంధించి సదరు వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశాడు.తాము బయట జీవిస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని స్వగ్రామం కి రావడంతో ఈ తిప్పలు తప్పడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.గ్రామ పెద్దలు నిర్ణయించిన మొత్తాన్ని కట్టలేక, వారు ఆ గ్రామాన్ని వదిలి వేరే గ్రామంలో ఉన్న వారి బంధువుల వద్ద నివాసం ఏర్పరుచుకున్నారు.

అయితే ఈ విషయాన్ని కాస్త అధికారులకు బాధిత కుటుంబం చేరవేయడంతో తమకు ఎలాగైనా న్యాయం చేయాలని వారు అధికారులను విజ్ఞప్తి చేసుకున్నారు.చూడాలి మరి చివరికి అధికారులు సదరు గ్రామ పెద్దలకు ఎలాంటి బుద్ధి చెప్తారో.

#25Lakhs #Odisha #Fine #InterCaste

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు