వ‌రుస ఓట‌ములు, అవ‌మానాలు.. చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ‌

రాజ‌కీయాలు అన్న త‌ర్వాత కొంత కాలం అనుకూలంగా ఉంటే మ‌రికొంత కాలం మాత్రం వ్య‌తిరేకంగా ఉండ‌టం స‌హ‌జం.అధికారంలో ఉన్నప్పుడు కాలం అనుకూలంగా ఉంటుంది.

 Successive Defeats, Insults Blow Upon Blow To Chandrababu, Ap Politics, Chandrababu , Naralokesh , Tdp Paerty , Ys Jagan , Ysrcp , Assebly , Achhanaidu ,-TeluguStop.com

అదే అధికారం కోల్పోతే మ‌త్రం ఐదేండ్ల వ‌ర‌కు వ్య‌తిరేక ప‌వ‌నాల‌కు ఎదురీదాల్సిందే.ఇదే విష‌యం ఇప్పుడు చంద్ర‌బాబుకు బాగా వ‌ర్తిస్తుంద‌నే చెప్పాలి.

నిజానికి ఆయ‌న 2019 ఎన్నిక‌ల్లో దారుణంగా ఓడిపోయినప్ప‌టి నుంచే గ‌త చరిత్ర‌లో ఆయ‌న ఎన్న‌డూ చూడ‌నంత దారుణ‌మైన పరిస్థితులును ఎదుర్కొంటున్నాడు.ఇక ఆ త‌ర్వాత వ‌స్తున్న అన్ని ఎన్నికల్లోనూ దారుణంగా ఓడిపోతూనే ఉన్నారు.

 Successive Defeats, Insults Blow Upon Blow To Chandrababu, Ap Politics, Chandrababu , Naralokesh , Tdp Paerty , Ys Jagan , Ysrcp , Assebly , Achhanaidu , -వ‌రుస ఓట‌ములు, అవ‌మానాలు.. చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వ‌రుస ఓట‌ముల‌తో పార్టీ స‌త‌మతం అవుతున్న వేల‌లో కుప్పంలో జ‌రిగిన అన్నిఎన్నిక‌ల్లోనూ చంద్ర‌బాబు ఓడిపోవ‌డం ఇంకా పెద్ద దెబ్బ అనే చెప్పాలి.ఇక పార్టీలోనూ ఆయ‌న ప్ర‌భావం త‌గ్గిపోతుండ‌టం నేత‌లెవ‌రూ కూడా ఆయ‌న్ను లెక్క‌చేయ‌క‌పోవ‌డం ఇంకా పెద్ద స‌మ‌స్య‌గా మారిపోయింది.

ఏక కాలంలో ప్ర‌త్య‌ర్థుల‌ను ఎదుర్కోవ‌డంతో పాటు పార్టీని ఏక‌తాటిమీద‌కు తేవ‌డం చ‌ద్ర‌బాబుకు పెద్ద స‌వాలుగా మారింది.మొన్న‌టికి మొన్న వైసీపీ నేత‌లు ఆయ‌న పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేయ‌డం లాంటివి కేడ‌ర్‌లో ఆత్మ స్తైర్యాన్ని కోల్పోయేలా చేశాయి.

ఇలా వ‌రుస ఓట‌ముల‌ను ఎదుర్కోవ‌డంతో పాటు మొన్న అసెంబ్లీ వేదిక‌గా దారుణ‌మైన వ్యాఖ్య‌లు ప‌డాల్సి రావ‌డం ఆయ‌న్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.ఒక స‌మ‌స్య నుంచి కోలుకోక‌ముందే మరో స‌మ‌స్య వ‌చ్చి ప‌డుతోంది.ఇలా వ‌రుస ప‌రాజ‌యాలు, అవ‌మానాలు ఆయ‌న‌కు గ‌తంలో పెద్ద‌గా జ‌ర‌గ‌లేదు.ఈ వ‌య‌సులో ఆయ‌న ఇలాంటి అనుభ‌వాలను ఎద‌ర్కోవాలంటే చాలా ఆత్మ‌స్థైర్యం కావాలి.ఇక‌ కేంద్రం కూడా ఆయ‌న‌కు వ్య‌తిరేకంగానే ఉంద‌ని తెలుస్తోంది.అసెంబ్లీ ఘ‌ట‌న‌పై కేంద్రం ఎలాంటి స్పంద‌న క‌న‌బ‌ర‌చ‌ట్లేదు.

ఇలాంటి స‌వాళ్ల‌ను, స‌మ‌స్య‌ల‌ను చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యాల‌తో ఎదుర్కొంటారో, ఎలాంటి వ్యూహాల‌తో ముందుకు వెళ్తారో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube