ఇక ఆపండ్రా బాబు మీ అతి.. షోపై నెటిజన్ల షాకింగ్ కామెంట్స్..?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.ఏ విషయంలోనైనా ప్రజలు పాజిటివ్ గా లేదా నెగిటివ్ గా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

 Successful Singing Show Latest Season Memes Goes Viral In Social Media-TeluguStop.com

తాజాగా ఇండియన్ ఐడల్ 12 రియాలిటీ షో ఎపిసోడ్ ప్రసారం కాగా జడ్జీలు, కంటెస్టెంట్లు ఏడుపులతో ఆ షోలో ఓవర్ డ్రామా చేశారు.సక్సెస్ ఫుల్ సింగింగ్ షో అయినప్పటికీ ఈ షోపై నెటిజన్లు మీమ్స్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

గత సీజన్లకు భిన్నంగా ఇండియన్ ఐడల్ 12 ఈ మధ్య కాలంలో తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉండటం గమనార్హం.కంటెస్టెంట్ల వ్యక్తిగత విషయాలను, విషాదాలను చూపిస్తూ షో నిర్వాహకులు కంటెస్టెంట్ల క్రేజ్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 Successful Singing Show Latest Season Memes Goes Viral In Social Media-ఇక ఆపండ్రా బాబు మీ అతి.. షోపై నెటిజన్ల షాకింగ్ కామెంట్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇండియన్ ఐడల్ 12 లో ప్రతిభ కంటే సింపథీకే ప్రాధాన్యత ఇస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఫాదర్స్ డే ఎపిసోడ్ లో జడ్జీలు, కంటెస్టెంట్లు తమ తండ్రుల గురించి చెప్పుకుంటూ షోను రక్తి కట్టించే ప్రయత్నాలు చేయగా సెట్స్ పై కంటెస్టెంట్ల, జడ్జీల తండ్రులు కూడా కనిపించారు.

దీంతో మీమ్స్ చేసేవాళ్లు ట్విట్టర్ లో మీమ్స్ ను తెగ వైరల్ చేస్తున్నారు.ఆ మీమ్స్ లో కొన్ని మీమ్స్ నవ్వించేలా ఉంటే మరికొన్ని మీమ్స్ వెటకారంగా ఉన్నాయి.

నిన్నటినుంచి మీమ్స్ సోషల్ మీడియా హల్చల్ చేస్తున్నాయి.

Telugu Fathers Day Episode, Goes Viral, India Idol 12, Netizens Memes-Movie

ఈ మీమ్స్ చూసైనా ఇండియన్ ఐడల్ 12 నిర్వాహకులు మారతారేమో చూడాల్సి ఉంది.గతంలో నెటిజన్లు రియాలిటీ షోలను ఈ స్థాయిలో ట్రోల్ చేసిన దాఖలాలు లేవు.ఈ ట్రోల్స్ పై ఇండియన్ ఐడల్ నిర్వాహకులు స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.

ఇక ఆపండ్రా బాబు మీ అతి అంటూ వైరల్ అవుతున్న మీమ్స్ నెటిజన్లకు నవ్వు తెప్పిస్తున్నాయి.

#Netizens Memes #Goes Viral #India Idol 12 #FathersDay

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు