మధ్యంతర ఎన్నికల్లో భారతీయుల హవా..!

ట్రంప్ పాలనకి ఈరోజు అగ్ని పరీక్ష జరుగనుంది ఈ పరీక్షలో ట్రంప్ పునీతుడై తిరిగి వస్తాడా లేదా అనేది తేలిపోతుంది.అయితే అధికారంలో ఉన్న ఏ పార్టీ మధ్యంత ఎన్నికలు కలిసి వచ్చినట్టుగా అమెరికా చరిత్రలోనే లేదు.

 Success Full Indian Nris In American Elections-TeluguStop.com

దాంతో ఇప్పుడు ఈ ఎన్నికలపై సర్వాత్రా ఆసక్తి నెలకొంది.ఇదిలాఉంటే అమెరికాలో ఈరోజు జరగబోయే మధ్యంతర ఎన్నికల్లో భారతీయులు తమ సత్తా చాటడానికి పోరు చేస్తున్నారు.ఒకరు కాదు ఇద్దరు కాదు

ఏకంగా 12 మంది భారతీయ అమెరికన్లు బరిలో నిలిచారు.అమెరికాలో వలస వ్యతిరేక విధానం తారాస్థాయికి పరిస్థితుల్లో వీరు బరిలో నిలిచి ప్రత్యర్థులకు గట్టిపోటీని ఇస్తున్నారు.అమెరికా జనాభా 32.57 కోట్ల మందిలో భారతీయులు ఒక్క శాతం మాత్రమే.అమెరికా రాజకీయాల్లో భారతీయ అమెరికన్ల సంఖ్య పెరిగిపోతుండటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని భారత్‌లో అమెరికా మాజీ రాయబారి రిచ్ వర్మ అన్నారు.

ఆయన పలువురు భారతీయ తరుపున ప్రచారం కూడా చేశారు.ప్రస్తుతం ప్రతినిధుల సభలో సభ్యులుగా ఉన్న నలుగురు భారతీయుల విజయం సునాయాసనంగా ఉంటుందని…వీరిలో మూడుసార్లు చట్టసభ సభ్యుడిగా ఉన్న అమీ బెరా కాలిఫోర్నియా 7వ కాంగ్రెషనల్ స్థానం నుంచి, రెండోసారి ఎన్నికలకు వెళ్తున్న చట్టసభ సభ్యులు రో ఖన్నా కాలిఫోర్నియా 17వ స్థానం నుంచి…రాజా కృష్ణమూర్తి ఇల్లినాయిస్ ఎనిమిదో స్థానం నుంచి, ప్రమీలా జయపాల్ వాషింగ్టన్ ఏడో స్థానం నుంచి పోటీలో ఉన్నారు.

ఇదిలాఉంటే సెనేట్‌కు పోటీచేస్తున్న ఏకైక భారతీయుడిగా పారిశ్రామిక వేత్త శివ అయ్యదురై నిలిచారు.ఈ ఏడాది దాదాపు 100 మంది భారతీయ అమెరికన్లు అన్నిస్థాయిల్లోని ప్రభుత్వ పదవులకు పోటీలో ఉన్నారు.వీరిలో కొంతమంది అమెరికన్ కాంగ్రెస్‌లోని రిపబ్లికన్ చట్టసభ సభ్యులను ఓడించి డెమోక్రాట్ల సంఖ్య పెరిగేలా చేయగలరు.

భారతీయ అమెరికన్ల మద్దతు లభించడం మాకు గర్వకారణం అని డెమోక్రటిక్ పార్టీ జాతీయ కమిటీ అధికార ప్రతినిధి జాన్ సాన్‌టోస్ పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube