మేకల పెంపకంపై రైతులకు 60 శాతం సబ్సిడీ

ఇంటిగ్రేటెడ్ మేకలు, గొర్రెల అభివృద్ధి పథకాన్ని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం అమ‌లుచేస్తోంది.ప్రైవేట్ సెక్టార్లలో మేకల ఫారమ్ తెరవడానికి బీహార్ రాష్ట్ర ప్రభుత్వం 10 మేక + 1 మేక, 20 మేక + 1 మేక, 40 మేక + 2 మేకల సామర్థ్యం ప్రకారం సబ్సిడీని అంద‌జేస్తోంది.ప్రస్తుతం బీహార్ ప్రభుత్వం ఈ పథకం కోసం దాదాపు రూ.2 కోట్ల 66 లక్షల బడ్జెట్‌ను కేటాయించింది.బీహార్ ప్రభుత్వ పశుసంవర్థక శాఖ వెబ్‌సైట్‌లో ఎస్‌సీఎస్టీ రిజర్వేషన్ ద్వారా దరఖాస్తుదారులకు మేకల పెంపకంపై 60 శాతం, సాధారణ వర్గం ప్రజలకు 50 శాతం సబ్సిడీని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది.

 Subsidy Goat Farming Bihar Government , Subsidy Goat Farming , Bihar Government , Goat Farming , Integrated Goats, Sheep, Department Of Animal Husbandry, Government Of Bihar-TeluguStop.com

20 మేక + 1 మేక పథకానికి అంచనా వ్యయం రూ.2.05 లక్షలుగా నిర్ణయించారు.దీనిపై 50 శాతం అంటే 1.025 లక్షల రూపాయలు జనరల్ కేటాగిరీకి.60 శాతం .1.23 లక్షల రూపాయలు ఎస్సీ, ఎస్టీ వర్గానికి బీహార్ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నారు.40 మేకలు + 2 మేకల పథకం 4.09 అంచనా వ్యయం.దీనిపై 50 శాతం సబ్సిడీ బట్టి 2.045 లక్షల రూపాయలు జనరల్ కేటగిరీకి అంద‌జేయ‌నున్నారు.మరోవైపు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రూ.2.454 లక్షల సబ్సిడీ లభిస్తుంది.అగ్రి కల్చర్ నిపుణుల అభిప్రాయం ప్రకారం మేకల పెంపకంపై రైతులు ఆసక్తి చూపాల్సిన అవ‌స‌రం ఉంది.మేకల పెంపకానికి ఖర్చు తక్కువ, ఇతర జంతువుల పెంప‌కం కంటే ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

 Subsidy Goat Farming Bihar Government , Subsidy Goat Farming , Bihar Government , Goat Farming , Integrated Goats, Sheep, Department Of Animal Husbandry, Government Of Bihar-మేకల పెంపకంపై రైతులకు 60 శాతం సబ్సిడీ-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube