మహేష్ , ఎన్టీఆర్ సెట్ లో అలా ఉంటారు.. శుభలేఖ సుధాకర్ కామెంట్స్ వైరల్!

Subhalekha Sudhkar Interesting Comments About Mahesh Babu And Ntr

టాలీవుడ్ ఇండస్ట్రీలో 100 కోట్ల రూపాయల మార్కెట్ ఉన్న స్టార్ హీరోలలో మహేష్, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు.మహేష్ బాబుకు క్లాస్ ఫ్యాన్స్ లో ఊహించని స్థాయిలో ఫాలోయింగ్ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కు మాస్ ఫ్యాన్స్ లో ఫాలోయింగ్ ఉంది.

 Subhalekha Sudhkar Interesting Comments About Mahesh Babu And Ntr-TeluguStop.com

ఈ ఇద్దరు హీరోలలో ఏ హీరో సినిమా రిలీజైనా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ అవుతుంటాయి.తాజాగా ఒక ఇంటర్వ్యూలో శుభలేఖ సుధాకర్ మహేష్, జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఓటీటీలలో కొన్ని సబ్జెక్టులు తీసే విధానం చూస్తుంటే అద్భుతమని అనిపిస్తోందని శుభలేఖ సుధాకర్ తెలిపారు.జూనియర్ ఎన్టీఆర్ తో తాను దమ్ము, అరవింద సమేత సినిమాలు చేశానని అరవింద సమేత మూవీలో తన పాత్ర చిన్నదే అయినా మంచి వేషం అని శుభలేఖ సుధాకర్ చెప్పుకొచ్చారు.

 Subhalekha Sudhkar Interesting Comments About Mahesh Babu And Ntr-మహేష్ , ఎన్టీఆర్ సెట్ లో అలా ఉంటారు.. శుభలేఖ సుధాకర్ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదని ఆయన పేర్కొన్నారు.ఎన్టీఆర్ సెట్ లో ఉన్నారంటే అల్లరిఅల్లరిగా ఉంటుందని శుభలేఖ సుధాకర్ పేర్కొన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు డైలాగ్స్ నేర్చుకుంటారో కూడా తనకు అర్థం కాదని ఎన్టీఆర్ ఎనర్జీ ఫెంటాస్టిక్ ఎనర్జీ అని శుభలేఖ సుధాకర్ వెల్లడించారు.మహేష్ బాబు కూడా సెట్ లో ఉన్న సమయంలో చాలా సరదాగా ఉంటారని శుభలేఖ సుధాకర్ పేర్కొన్నారు.

మహేష్, ఎన్టీఆర్ గురించి శుభలేఖ సుధాకర్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు.

సర్కారు వారి పాట ఏప్రిల్ సెంటిమెంట్ ను నమ్ముకుని 2022 ఏప్రిల్ నెలలో విడుదల కానుంది.పోకిరి, భరత్ అనే నేను సినిమాలు విడుదలైన నెలలోనే సర్కారు వారి పాట రిలీజ్ కానుంది.మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ పనులతో బిజీ కానున్నారు.

#Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube