సినిమాల్లోకి రాకముందు శుభలేఖ సుధాకర్ ఏం చేసేవారో మీకు తెలుసా?

టాలీవుడ్ ప్రేక్షకులకు శుభలేఖ సుధాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు.శుభలేఖ సినిమాతో ప్రేక్షకులకు సుపరిచితులు కావడంతో శుభలేఖ సుధాకర్ కు ఆ పేరు వచ్చింది.

 Subhalekha Sudhakar Hotel Receptionist Turned Actor , Subhalekha Sudhakar , Hot-TeluguStop.com

ఈ మధ్య కాలంలో శుభలేఖ సుధాకర్ కు సినిమా ఆఫర్లు తగ్గాయి.తెలుగులో శుభలేఖ సుధాకర్ సినిమాలతో పాటు సీరియళ్లతో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

అయితే శుభలేఖ సుధాకర్ వ్యక్తిగత జీవితం గురించి మాత్రం చాలామందికి తెలియదు.

కామెడీ పాత్రలతో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా శుభలేఖ సుధాకర్ ప్రేక్షకుల్లో పాపులారిటీని సంపాదించుకున్నారు.

కొన్ని సినిమాల్లో శుభలేఖ సుధాకర్ నెగిటివ్ రోల్స్ లో కూడా నటించారు.అయితే బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ వల్ల శుభలేఖ సుధాకర్ కు సినిమాలపై ఆసక్తి కలిగింది.

శుభలేఖ సుధాకర్ తనకు ఊహ తెలిసిన తర్వాత చూసిన తొలి సినిమా దీవార్ కావడం గమనార్హం.అయితే సుధాకర్ ఫ్యామిలీ మెంబర్స్ కు మాత్రం సినిమాలు అంటే ఇష్టం ఉండేది కాదు.

Telugu Amitab Bachhan, Personal, Tollywod, Tollywood-Movie

ఆ తర్వాత చాలా కష్టపడి శుభలేఖ సుధాకర్ యాక్టింగ్ లో డిప్లొమా చేశారు.సప్తపది సినిమా షూటింగ్ సమయంలో శుభలేఖ సుధాకర్ కె.విశ్వనాథ్ ను కలిసి అవకాశం అడగగా ఆయనకు నిరాశే ఎదురైంది.ఆ తర్వాత మద్రాస్ లో తాజ్ కోరమాండల్ అనే స్టార్ హోటల్ లో శుభలేఖ సుధాకర్ రిసెప్షనిస్ట్ గా చేరారు.

ఆ తర్వాత విశ్వనాథ్ సుధాకర్ కు శుభలేఖ సినిమాలో అవకాశం ఇచ్చారు.

Telugu Amitab Bachhan, Personal, Tollywod, Tollywood-Movie

శుభలేఖ సినిమాలో హీరో పాత్రలో చిరంజీవి నటించగా ఆ సినిమా హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.విలాసవంతమైన స్టార్ హోటల్స్ లో ఒకటైన తాజ్ కోరమాండల్ లో సుధాకర్ దాదాపుగా సంవత్సరం పాటు పని చేశారు.సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ శుభలేఖ సుధాకర్ కెరీర్ లో అంతకంతకూ ఎదిగారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube