సినిమాల్లోకి రాకముందు శుభలేఖ సుధాకర్ ఏ పని చేశాడో తెలుసా?

Subhalekha Sudhakar Early Days Struggles

శుభ‌లేఖ సుధాక‌ర్.తొలుత కామెడీ నటుడిగా సినిమాల్లోకి ప్రవేశించాడు.

 Subhalekha Sudhakar Early Days Struggles-TeluguStop.com

అనంతరం తన చక్కటి కామెడీతో జనాలను కడుపుబ్బా నవ్వించాడు.అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేశారు.

అద్భుత పాత్రలు చేసి అందరి ప్రశంసలు పొందారు. కమల్ హాసన్ సినిమా ద్రోహిలో నెగెటివ్ రోల్ ప్లే చేశాడు.

 Subhalekha Sudhakar Early Days Struggles-సినిమాల్లోకి రాకముందు శుభలేఖ సుధాకర్ ఏ పని చేశాడో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు.

నిజానికి సుధాక‌ర్ ఇంట్లో వాళ్లకు.

అంటే తన తండ్రికి తాతకు కూడా సినిమాలంటే అసలు ఇష్టం ఉండేది కాదు.వాళ్లు సినిమాలు కూడా అస్సలు చూసేవారు కాదు.

కానీ సుధాకర్ కు సినిమాలు అంటే చాలా ఇష్టం ఉండేది.ఆయనకు సినిమా రంగంపై మక్కువ పెరగడానికి కారణం అమితాబ్ బచ్చన్.

దీవార్ సినిమాలో బిగ్ బీ నటన చూసి సుధాకర్ కు సినిమాల్లోకి రావాలనే ఆసక్తి కలిగింది.ఇంట్లో వాళ్లను ఒప్పించి మద్రాసుకు వెళ్లాడు.

అక్కడ ఓ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో యాక్టింగ్ విభాగంలో డిప్లామా చేశాడు.అనంతరం విశ్వనాథ్ వైజాగ్ లో సప్తపది సినిమా షూటింగ్ చేస్తున్నారు.

అక్కడ తనను కలిసి వివరాలు చెప్పాడు.కానీ తన నుంచి పిలుపు రాలేదు.

మద్రాసు వెళ్లి సినిమా అకాశాల కోసం ట్రై చేయాలి.అందుకు డబ్బు కావాలి.

Telugu Chiranjeevi, Institute, Taj Coromandel, Vishwanath-Telugu Stop Exclusive Top Stories

అప్పుడే తను ఉద్యోగం కోసం ప్రయత్నం మొదలు పెట్టాడు.తాజ్ కొరమాండల్ లో ఉద్యోగం కోసం ప్రయత్నించాడు.రిసెప్షనిస్టుగా జాబ్ వచ్చింది.ఏడాది పాటు జాబ్ చేశాడు.అది రిచ్ హోటల్.అందులో సంపన్నులు మాత్రమే బస చేస్తారు.

ఆ హోటల్ లో రూమ్ తీసుకుని ఉంటే బాగుండేది అనుకున్న సుధాకర కు అందులో ఉద్యోగం రావడం పట్ల ఎంతో సంతోషపడ్డాడు.ఆ ఉద్యోగం చేస్తుండగానే విశ్వనాథ్ నుంచి పిలుపు వచ్చింది.

వెళ్లి కలిశాడు.చిరంజీవి మెయిన్ రోల్ చేస్తున్న ఓ సినిమాలో సుధాకర్ కు అకాశం ఇచ్చారు.

ఆ సినిమా పేరే శుభలేఖ.అప్పటి నుంచే తను శుభలేఖ సుధాకర్ అయ్యాడు.అనంతరం చక్కటి సినిమాల్లో నటించాడు.

#Chiranjeevi #Taj Coromandel #Institute #Vishwanath

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube