బాలయ్య-చిరు మధ్య వార్.. రియల్ కాదు రీల్!  

Subbirami Reddy Multistarrer With Balakrishna Chiranjeevi In Dilemma - Telugu Balakrishna, Chiranjeevi, Multistarrer, Subbirami Reddy

టాలీవుడ్‌లో మనం చాలా మల్టీస్టారర్ సినిమాలు చూశాం.కానీ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి సినిమా చేస్తే ఆ మల్టీస్టారర్ మూవీ ఎలా ఉంటుందా అని ఇప్పటివరకు ఎవరూ చూడలేదు.

 Subbirami Reddy Multistarrer With Balakrishna Chiranjeevi In Dilemma

త్వరలోనే ఇలాంటి మూవీగా వస్తోన్న ఆర్ఆర్ఆర్‌తో ప్రేక్షకుల కోరిక తీరనుంది.అయితే యంగ్ హీరోలు కాకుండా స్టార్ హీరోలు ఇలాంటి ఫీట్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వస్తేనే ఆ అనుభూతి వేరు.

కానీ ఈ ఆలోచనను ఆచరణలో పెట్టాలని ఓ బడా నిర్మాత ప్రయత్నిస్తున్నాడు.

బాలయ్య-చిరు మధ్య వార్.. రియల్ కాదు రీల్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

గతంలో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు తెరకెక్కించిన ప్రముఖ నిర్మాత టి.

సుబ్బిరామిరెడ్డి ఎప్పటికైనా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణతో కలిసి ఓ భారీ మల్టీస్టారర్ మూవీ తీస్తానని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.అప్పటి నుండి ఈ కాంబినేషన్‌లో మల్టీస్టారర్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అటు మెగా ఫ్యాన్స్‌తో పాటు నందమూరి అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే గతకొంత కాలంగా ఈ ఇద్దరు హీరోల మధ్య పలు విబేధాలు వస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.కానీ బయటకు మాత్రం అది పెద్దగా కనిపించలేదు.

అయితే తాజాగా సీఎం కేసీఆర్, మంత్రి తలసానితో తెలుగు సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు జరిపిన చర్చలకు బాలయ్యను పిలవకపోవడంతో చిరుతో ఆయనకున్న విబేధాలు బట్టబయలు అయ్యాయి.దీంతో వీరిద్దరి మధ్య ప్రస్తుతం ఓ చిన్నసైజ్ వార్ నడుస్తుంది.

కాగా ఇలాంటి విబేధాలు ఉన్న ఈ హీరోలు కలిసి మల్టీస్టారర్ మూవీని చేస్తారా అనే సందేహం ఫ్యాన్స్‌లో నెలకొంది.ఏదేమైనా బాలయ్య-చిరుల మధ్య రీల్ వార్ జరుగుతుందని అందరూ అనుకుంటే ఇప్పుడు రియల్ వార్ జరుగుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Subbirami Reddy Multistarrer With Balakrishna Chiranjeevi In Dilemma Related Telugu News,Photos/Pics,Images..

footer-test