సక్సెస్‌ స్టోరీ : గోదావరి జిల్లాలోనే ఈ హోటల్‌ ఫేమస్‌... 65 ఏళ్లుగా ఆప్యాయంగా వడ్డిస్తారు

గోదావరి జిల్లాల్లో ఎన్నో పెద్ద పెద్ద హోటల్స్‌ ఉంటాయి, స్టార్‌ హోటల్స్‌ నుండి చిన్న స్థాయి హోటల్స్‌ వరకు ఎన్నో ఉంటాయి.అయితే గోదావరి జిల్లాల్లో ఫేమస్‌ హోటల్‌ ఏది అంటే అందరి నుండి ఠక్కున వినిపించే పేరు సుబ్బయ్య హోటల్‌.

 Subbayya Gari Hotel Kakinada Success Story-TeluguStop.com

అవును గోదావరి జిల్లాల్లోనే కాకుండా ఏపీ మొత్తం ఏపీ మొత్తంలో కూడా ఈ హోటల్‌ చాలా ప్రముఖంగా వినిపిస్తుంది.ఈ హోటల్‌ను ప్రారంభించిన సుబ్బయ్య గారిది ఒక అద్బుతమైన సక్సెస్‌ జర్నీగా చెప్పుకోవచ్చు.65 ఏళ్ల క్రితం అతడు మొదలు పెట్టిన హోటల్‌ను ఇప్పటికి ఆయన వారసులు నడుపుతున్నారు.ఇప్పుడు అయితే భారీగా ఆదాయం వస్తుంది కాని, ఆయన మొదట ప్రారంభించిన సమయంలో నడపడమే కష్టం అయ్యింది.అయినా కూడా వెనకడుగు వేయకుండా తీవ్రంగా ప్రయత్నాలు చేసి హోటల్‌ను సక్సెస్‌ చేశాడు

సుబ్బయ్య సక్సెస్‌ స్టోరీ :

1950వ సంవత్సరంలో గుంటూరుకు చెందిన గునుపూడి సుబ్బయ్య కాకినాడకు వలస వెళ్లాడు.మొదట కాకినాడలో వంటల మాస్టర్‌గా పని చేశాడు.అయిదు సంవత్సరాల పాటు వివాహాది వేడుకలకు వంటలు వండటం చేసేవాడు.ఆ తర్వాత స్థానిక కలెక్టరేట్‌ సమీపంలో ఒక హోటల్‌ను ప్రారంభించాడు.1955లో ప్రారంభం అయిన హోటల్‌కు మొదట కస్టమర్లు చాలా తక్కువగా వచ్చేవారు.అప్పట్లో డబ్బులు పెట్టి హోటల్‌లో భోజనం చేయడం ఏంటీ అని అనుకునేవారు.

ఎక్కువ శాతం పూటకూళ్లు చేసేవారు.పూటకూళ్లు అంటే ఏదైనా పని చేస్తే ఆ పనికి తగ్గట్లుగా ఉన్నవారు అన్నం పెట్టే వారు.

అలా కడుపు నింపుకునేవారు

అప్పట్లో హోటల్స్‌ అనేవి చాలా చాలా తక్కువ.ఉన్నా కూడా వాటి మనుగడ కష్టంగా ఉండేది.

అప్పట్లో వెయ్యి రూపాయలు పెట్టి ప్రారంభించిన హోటల్‌ మొదట కొన్ని సంవత్సరాలు లాస్‌లోనే సాగింది.అయితే చాలా ప్రత్యేకమైన వంటలు వండటంతో పాటు, ఒకసారి వచ్చిన వారు మళ్లీ మళ్లీ రావాలనిపించే విధంగా వడ్డించడం, ఆప్యాయంగా వచ్చిన వారితో మాట్లాడుతూ వడ్డించడం వంటివి చేయడం వల్ల కస్టమర్లు పెరిగాయి.

మొదట హోటల్‌కు పేరేం పెట్టలేదు.అయితే హోటల్‌ యజమాని సుబ్బయ్య అవ్వడంతో స్థానికులు అంతా కూడా సుబ్బయ్య హోటల్‌ అంటూ పిలిచే వారు.

దాంతో అదే పేరు అయ్యింది.ఒక రంగంలో మనం ముందుకు వెళ్లాలి అనుకున్నప్పుడు వెంటనే సక్సెస్‌ రాకున్నా వదిలి పెట్టకుండా ప్రయత్నిస్తే ఖచ్చితంగా సక్సెస్‌ అవుతుంది అనేది సుబ్బయ్య సక్సెస్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube