టాలీవుడ్ స్టైలిష్ స్టార్ తాజాగా నటించిన టువంటి చిత్రం అల వైకుంఠపురం లో.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మాట్లాడుతూ దర్శకుడు దర్శకత్వం వహించగా ప్రముఖ చిత్రనిర్మాత అల్లు అరవింద్ నిర్మించారు.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ నటించారు.అలాగే ఈ చిత్రంలో లో సీనియర్ నటి టబు, జయ రామ, సునీల్, సుశాంత్, విలక్షణ నటుడు సముద్రఖని, వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు.
అయితే తాజాగా అల వైకుంఠ పురం లో చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేయడమే కాకుండా దర్శక నిర్మాతలకి కాసుల వర్షం కురిపించింది.అంతేగాక ఇప్పటికే కొన్ని చోట్ల నాన్ బాహుబలి చిత్ర రికార్డులని కూడా బద్దలు కొట్టినట్లు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా తెలిపారు.
దీంతో అల్లు అర్జున్ మరియు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుపతికి విచ్చేసినారు.అయితే వీరికి ఆలయ ప్రధాన అర్చకులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక పూజా కార్యక్రమాలకి ఏర్పాట్లు చేశారు.
పూజ అనంతరం త్రివిక్రమ్, బన్నీ లకు ప్రధాన అర్చకులు ఆశీర్వాదాలతో పాటు స్వామివారి తీర్థప్రసాదాలు మరియు చిత్రపటాలను అందించారు.
అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న టువంటి ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.అలాగే ఇప్పటికే ఈ చిత్ర సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.అంతేగాక పలువురు పెద్దల సమక్షంలో ఈ చిత్రాన్ని అధికారికంగా లాంచ్ చేయడం కోసం సన్నాహాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
.