స్టైలిష్‌ స్టార్‌ స్టైలిష్‌ ఆఫీస్‌ విశేషాలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే  

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఏం చేసినా చాలా స్టైలిష్‌గా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన తన ప్రతి సినిమాలో చాలా స్టైలిష్‌గా కనిపిస్తూ ఉంటాడు. తన భార్య పిల్లల విషయంలో కూడ స్టైల్‌ కొత్తగా ఉండేలా ప్లాన్‌ చేస్తూ ఉంటాడట. అటువంటి స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఆ మద్య ఒక ఇంటిని అత్యంత స్టైలిష్‌ గా నిర్మించుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు అదే అల్లు అర్జున్‌ తన కోసం ఒక అల్ట్రా స్టైల్‌ ఆఫీస్‌ను రూపొందించుకున్నాడట.

Stylish Star Allu Arjun Office-Allu Producer Jubilee Hills Stylish Office

Stylish Star Allu Arjun Stylish Office

ఇప్పటి వరకు అల్లు అర్జున్‌కు ప్రత్యేకంగా ఆఫీస్‌ ఏమీ లేదు. ప్రతి హీరోకు ఆఫీస్‌లు ఉంటాయి. కాని అల్లు అర్జున్‌కు మాత్రం గీతా ఆర్ట్స్‌ ఆఫీస్‌ తన ఆఫీస్‌గా వస్తోంది. అయితే ఇకపై అల్లు అర్జున్‌కు ప్రత్యేకమైన ఆఫీస్‌ ఉండబోతుంది. త్వరలోనే అల్లు అర్జున్‌ నిర్మాతగా మారబోతున్నాడనే వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. త్వరలోనే కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించబోతున్న అల్లు అర్జున్‌కు కొత్త ఆఫీస్‌ కావాల్సి వచ్చిందట. అందుకే జూబ్లీహిల్స్‌లో ఒక ఆఫీస్‌ నిర్మాణం చేయించాడు.

Stylish Star Allu Arjun Office-Allu Producer Jubilee Hills Stylish Office

ఆ ఆఫీస్‌ మొత్తం కూడా తన స్టైల్‌లో దగ్గరుండి ఇంటీరియర్‌ డిజైన్‌ చేయించుకున్నాడట. ప్రశాంత వాతావరణం ఉండేలా, కళ్లకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా లైట్‌ కలర్స్‌తో, హాల్‌ మరియు బాల్కనీలో చెట్టు, అత్యంత ఖరీదైన మార్బుల్స్‌, డిజైన్డ్‌ సీలింగ్‌, సెంట్రల్‌ ఏసీతో పాటు ప్రత్యేకమైన మినీ థియేటర్‌ను కూడా ఏర్పాటు చేశారట. కథ చర్చలు మరియు సినిమాలకు సంబంధించిన ఇతర విషయాలను ఈ ఆఫీస్‌లో ఇకపై బన్నీ చేయబోతున్నాడు. ఇలాంటి ప్రశాంతమైన ఆఫీస్‌లో తన దర్శకులతో కథలు రాయించుకుంటాడట.